Begin typing your search above and press return to search.

క‌విత మంచి చాన్స్ మిస్ చేసుకున్నారా?

By:  Tupaki Desk   |   25 Oct 2019 3:37 AM GMT
క‌విత మంచి చాన్స్ మిస్ చేసుకున్నారా?
X
తెలుగు రాష్ట్రాల్లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ విజ‌యం సాధించింది. టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి రెడ్డి పై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 43,284 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతిరెడ్డిపై శానంపూడి సైదిరెడ్డి గెలుపొందారు. మొత్తం 22 రౌండ్లలోనూ సైదిరెడ్డినే ఆధిక్యం ప్రదర్శించారు. అయితే, ఈ ఫలితం నేప‌థ్యంలో...తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూతురు, సిట్టింగ్ ఎంపీ క‌విత మంచి చాన్స్ మిస్ చేసుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇటీవ‌ల తెలంగాణ‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన నియోజ‌క‌వ‌ర్గం నిజామాబాద్‌. జిల్లాకు చెందిన పసుపు రైతులు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసి దేశం చూపును త‌మ‌వైపు తిప్పుకొన్నారు. అనంత‌రం వెలువ‌డిన ఫ‌లితాల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసిన క‌విత‌ ఓట‌మి పాల‌య్యారు. అదే స‌మ‌యంలో పీసీసీ అధ్య‌క్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగా ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. ఎంపీగా ఎన్నికైన నేప‌థ్యంలో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇక్క ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది. అయితే, ఇక్క‌డ క‌వితను బ‌రిలో దింపుతార‌నే ప్ర‌చారం సాగింది. కానీ ఆ నిర్ణ‌యం టీఆర్ఎస్ పెద్ద‌లు ఉపసంహ‌రించుకున్నారు.

తాజాగా, పార్ల‌మెంటు ఎన్నిక‌లో ప‌రాజ‌యం పాలైన అనంత‌రం క‌విత రాజ‌కీయ సంబంధిత వ్య‌వ‌హారాల‌కు ఒకింత‌ దూరంగా ఉంటున్నారు. ఆమెను హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దింపితే...రాజ‌కీయంగా తిరిగి మ‌రింత చురుగ్గా స్పందించే అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు అయి ఉండేద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. తాజా ఫ‌లితం నేప‌థ్యంలో...కేసీఆర్ తీసుకునే నిర్ణ‌యంపై స‌హ‌జంగానే..ఆస‌క్తి నెల‌కొంది.