Begin typing your search above and press return to search.
మునుగోడు బైపోల్స్: పోస్టల్ బ్యాలెట్, తొలి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం
By: Tupaki Desk | 6 Nov 2022 3:50 AM GMTఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టే మునుగోడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఊహించినట్టే టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. తెలంగాణ రాజకీయాల హీట్ పెంచుతూ మునుగోడు వేడి మరింత రాజుకుంది. 93శాతం పోలింగ్ నమోదైన మునుగోడులో ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్లో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు.
నల్గొండ జిల్లా అర్జాలబావిలోని వేర్ హౌసింగ్ గోడౌన్స్ లో ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 15 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నానికి తుది ఫలితం వెలువడే అవకాశాలున్నాయి.
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి బరిలోకి దిగారు.
ఇక తొలి రౌండ్ గా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. స్టల్ బ్యాలెట్ లో టీఆరెఎస్ ముందంజ వేసింది. 686 పోస్టల్ బ్యాలెట్.. 6సర్వీసు ఓటర్లు.. మొత్తం 692 ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థికి 4 ఓట్ల ఆధిక్యం లభించింది. వీటితో టీఆర్ఎస్ కు 228 ఓట్లు రాగా.. బీజేపీకి 224, బీఎస్పీ అభ్యర్థికి 10 ఓట్లు వచ్చాయి.
ఇక తొలి రౌండ్ లో టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 2వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించిడం విశేషం. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కు 6069 ఓట్లు రాగా.. బీజేపీకి 4904 ఓట్లు, కాంగ్రెస్ కు 1887 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ లోనే టీఆర్ఎస్ ఏకంగా 1192 ఓట్ల మెజార్టీ సాధించడం విశేషం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా గులాబీ దండు మునుగోడులో పోటీనిస్తోంది. అయితే బీజేపీ కూడా బాగానే ఫైట్ ఇస్తోంది.