Begin typing your search above and press return to search.
నమస్తే పెట్టలేదని గులాబీ నేత జులుం!
By: Tupaki Desk | 4 May 2019 5:28 AM GMTస్థాయి పెరుగుతున్న కొద్దీ ఒదిగి ఉండాలన్న గులాబీ బాస్ మాటల్ని గులాబీ నేతలు మర్చిపోతున్నారా? చిన్న విషయాలకు అనవసరంగా రెచ్చిపోతున్నారా? లేనిపోని వివాదాలతో అధికార పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో తాజాగా చోటు చేసుకున్న ఉదంతం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.
జూబ్లీహిల్స్ రహమత్ నగర్ కు చెందిన టీఆర్ ఎస్ నేత అరుణ్ కుమార్ కు కొందరు యువకులకు మధ్య నెలకొన్న మాటల యుద్ధం ప్రత్యక్ష దాడులకు కారణమైంది. ఇరువురి మధ్య ఉన్న వివాదం నేపథ్యంలో.. తనకు నమస్తే పెట్టలేదంటూ టీఆర్ఎస్ నేత అరుణ్ కక్ష పెంచుకున్నాడని బాధితుడు మనోజ్ చెబుతున్నారు.
కొంతమంది యువకులతో కలిసి తనపై దాడికి పాల్పడినట్లుగా అరుణ్ పై ఫిర్యాదు చేశారు మనోజ్. ఈ నేపథ్యంలో అరుణ్ వర్గీయులు కొందరు పోలీస్ స్టేషన్లో వీరంగం వేయటం సంచలనంగా మారింది. ఇరువర్గాల మధ్య నడుస్తున్న లొల్లి విషయంలో జూబ్లీహిల్స్ పోలీసులు చోద్యం చూస్తున్నట్లుగా ఉండిపోయారే తప్పించి.. కంట్రోల్ చేయలేదన్న విమర్శ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. పోలీసులు చూస్తుండగానే.. బాధిత యువకులను అంతం చేస్తామంటూ అరుణ్ గ్యాంగ్ వార్నింగ్ ఇస్తున్నా.. పట్టనట్లుగా పోలీసులు ఉండటం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఉదంతంపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అదే సమయంలో.. తమ వివాదాస్పద తీరుతో పార్టీకి నష్టం వాటిల్లేలా చేస్తున్న వారిపై పార్టీ వర్గాలు దృష్టి సారించి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.