Begin typing your search above and press return to search.

కేసీఆర్ అన్యాయం చేశాడ‌ని...నేత ఆత్మ‌హత్య

By:  Tupaki Desk   |   22 Sep 2017 9:51 AM GMT
కేసీఆర్ అన్యాయం చేశాడ‌ని...నేత ఆత్మ‌హత్య
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు - ఆయ‌న అభిమానుల‌కు ఇది ఖ‌చ్చితంగా దుర్వార్తే. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డి మూడున్న‌రేళ్లు దాటిన‌ప్ప‌టికీ నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సానుకూల‌ నిర్ణ‌యం తీసుకోవ‌డం లేద‌నేది రాజ‌కీయ విశ్లేష‌కులతో పాటు టీఆర్ ఎస్ నేత‌ల మాట‌. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం రాష్ట్ర స్థాయి ప‌ద‌వుల‌ను మాత్ర‌మే భ‌ర్తీ చేసిన సీఎం కేసీఆర్ ఇందులో ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌కు చాన్స్ ఇవ్వ‌లేదు. కేవ‌లం కార్పొరేష‌న్ చైర్మ‌న్ గిరీలు తప్ప వాటి డైరెక్ట‌ర్లు ఇత‌ర‌త్రాలు భ‌ర్తీ చేయ‌లేదు. అయితే ఇలా భ‌ర్తీ జ‌రిగిన వాటిలోనూ తెలంగాణ ఉద్య‌మంలో ముందుండి పోరాడిన వారికి న్యాయం జ‌ర‌గ‌లేద‌నే భావ‌న ఉంది. ఇలా త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌న వాపోతూ సాక్షాత్తు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఎదుట వికారాబాద్‌ జిల్లా తాండూరు టీఆర్‌ ఎస్ నేత అయూబ్ ఖాన్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకున్నాడు.

పార్టీ స‌మావేశం సంద‌ర్భంగా హాజ‌రైన మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి ముందే...ఉద్యమాకారులకు పార్టీలో తగిన గుర్తింపు లేదని ఆయూబ్ ఆగస్టు 30న అయూబ్‌ఖాన్ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనతో సమావేశంలో ఉన్న మంత్రి మహేందర్‌ రెడ్డితోపాటు కార్యకర్తలు నిర్ఘాంతపోయారు. అయితే కార్యకర్తలు వెంటనే మంటలు ఆర్పివేసి అతడిని హుటాహుటిన తాండారు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ప‌రిస్థితి విష‌మించ‌డంతో అక్కడ్నుంచి మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌ లోని నిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం అయూబ్ మృతి చెందారు. అయూబ్‌ ఖాన్ మృతి పట్ల మంత్రి మహేందర్‌ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు ఆయూబ్ మృతితో తాండూర్‌ లోని మంత్రి ఇంటి దగ్గర భద్రత పెంచడం గ‌మ‌నార్హం.

ఈ ప‌రిణామం టీఆర్ ఎస్ పార్టీ నేత‌లు సైతం జీర్ణించుకోలేక‌పోతుండ‌టం విశేషం. ప్ర‌భుత్వం ఏర్ప‌డి మూడున్న‌రేళ్లు దాటిపోయిన‌ప్ప‌టికీ నామినేటెడ్ ప‌ద‌వులు భ‌ర్తీ చేయ‌క‌పోవ‌డం, భ‌ర్తీ చేసిన వారిలోనూ తెలంగాణ ఉద్య‌మంలో భాగ‌స్వామ్యం అయిన‌వారికి కాకుండా...రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత టీఆర్ ఎస్‌ లో చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వ‌డం వ‌ల్ల గులాబీ శ్రేణుల్లో నిరాశ ఉంద‌ని అంగీక‌రిస్తున్నారు. అలా త‌మ ఆవేద‌న‌ను అణుచుకోలేక‌నే అయూబ్ ఖాన్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డార‌ని వాపోతున్నారు.