Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు షాకిచ్చిన బాబు మోహన్
By: Tupaki Desk | 29 Sep 2018 8:17 AM GMTకేసీఆర్ ను ముద్దుగా బావా అని పిలిచే కమెడియన్ కం తాజా మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ సడన్ గా ఇంత షాకిస్తాడని అస్సలు అనుకోలేదు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ప్రకటించిన 105 మంది ఎమ్మెల్యేల జాబితాలో తాజా మాజీ బాబు మోహన్ కు టికెట్ నిరాకరించాడు. ఆంధోల్ లో బాబు మోహన్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలిందట. అంతేకాదు.. ఇక్కడ మాజీ డిప్యూటీ సీఎం - కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహాను ఓడించాలంటే బాబు మోహన్ వల్ల కాదని కేసీఆర్ డిసైడ్ అయ్యి ఆయనకు టికెట్ నిరాకరించారు. జర్నలిస్ట్ క్రాంతికి టికెట్ ఇచ్చాడు.
బాబు మోహన్ కు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఆ తర్వాత అసమ్మతి గళం వినిపించలేదు. కేసీఆర్ పిలిపించి మాట్లాడేసరికి సైలెంట్ అయిపోయారు. సినిమాలు చేసుకుంటూ కాలం గడిపేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు సడన్ గా బీజేపీలో చేరబోతున్నట్టు సమాచారం.
తాజాగా బాబు మోహన్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కే. లక్ష్మన్ తో కలిసి ఢిల్లీ వెళ్లినట్టు వార్తలొస్తున్నాయి. ఆయన మరికాసట్లోనే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలిసి బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఆంధోల్ బీజేపీ టికెట్ ఇస్తామన్న హామీతోనే బాబు మోహన్ బీజేపీలో చేరబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం టీఆర్ఎస్ ఇక్కడి నుంచి జర్నలిస్టు క్రాంతికుమార్ ను రంగంలోకి దించుతోంది. బాబు మోహన్ చేరికతో బీజేపీకి ఆందోల్ లో బలం పెరుగుతుందని ఆ పార్టీ భావిస్తోంది..దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ అనివార్యంగా మారింది. ఇది ఓ రకంగా టీఆర్ఎస్ అభ్యర్థికి చిక్కులు తెచ్చి పెట్టే అంశమే అయ్యింది.