Begin typing your search above and press return to search.

హరీశ్ ఫ్లెక్సీ పెట్టినా.. కాచిగూడ పోలీసులు కేసు బుక్

By:  Tupaki Desk   |   14 Jan 2020 7:00 AM GMT
హరీశ్ ఫ్లెక్సీ పెట్టినా.. కాచిగూడ పోలీసులు కేసు బుక్
X
చట్టం అందరికి చుట్టమే. ఎవరికి ఎక్కువ కాదు. అలా అని ఎవరికి తక్కువ కాదు. అందరూ సమానమనే మాట పుస్తకాల్లోనూ.. రూల్ బుక్ లో కనిపిస్తుంటుంది. కానీ.. ప్రాక్టికల్ గా మాత్రం అలాంటివి అమలవుతున్నట్లు ఎక్కడా కనిపించదు. అయితే.. కొన్నిసార్లు అనూహ్య పరిణామాలు చోటు చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచేలా పరిణామాలు చోటు చేసుకుంటాయి. తాజాగా అలాంటిదే ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు ఒక వ్యక్తిపై కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ మంత్రివర్గంలో పవర్ ఫుల్ మంత్రుల్లో హరీశ్ ఒకరు. అలాంటి ఆయన ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయటమా? అంటే.. చేయక తప్పలేదని చెప్పాలి. అయితే.. కేసు నమోదు చేసిన వైనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నల్లకుంటలోని పద్మ కాలనీకి చెందిన టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ డిసెంబరు 27న అయ్యప్ప పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు పూజకు హాజరయ్యారు. హరీశ్ అంతటి నేత వస్తుంటే ఒక ఫ్లెక్సీ అయినా ఏర్పాటు చేయకుండా ఉంటారా? హరీశ్ సారు మీద తనకున్న అభిమానాన్ని ప్రదర్శించేందుకు వీలుగా ఆయనకు స్వాగతం పలుకుతూ నారాయణ గూడ నుంచి నల్లకుంట వరకూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

దీనిపై సమాచార హక్కు కార్యకర్త విజయగోపాల్ పోలీసులకు కంప్లైంట్ చేశారు.సున్నితమైన అంశాలు.. అందునా ప్రముఖులతో ముడిపడిన ఉదంతాల విషయంలో అప్రమత్తంగా ఉంటున్న పోలీసులు మొదట కాస్త నాన్చినా.. ఈ విషయాన్ని మరీ సాగదీస్తే కొత్త తలనొప్పులు వస్తాయన్న ఆలోచనతో కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఫ్లెక్సీలుఏర్పాటు చేసిన శ్రీనివాస్ గౌడ్ మీద కాచిగూడ పోలీసులు ఐపీసీ 268 - 336 సెక్షన్ల కింద కేసు నమోదు చేయటం గమనార్హం. అధికారపార్టీలో నెంబరు త్రీ స్థానంలో ఉన్న హరీశ్ సారు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే కేసు నమోదు చేస్తారా? అన్న విస్మయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.