Begin typing your search above and press return to search.
విశ్వక్ సేన్ పై తెరాస నేత వీరంగం
By: Tupaki Desk | 3 May 2022 9:39 AM GMTయంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కు టీవీ 9 ఛానల్ యాంకర్ కు మధ్య జరిగిన వివాదం ప్రస్తుతం చిలికి చిలికి దుమారంగా మారుతోంది. తనని సదరు మహిళా యాంకర్ గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో అంటూ దురుసుగా ప్రవర్తించడంతో విశ్వక్ సేన్ తననే ఇంటర్వ్యూకు పిలిచి అవమానిస్తున్నారంటూ 'F' పదాన్ని ఉపయోగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వక్ సేన్ ఈ విషయంలో తన తొందరపాటుకు క్షమాపణలు కోరుతూ వివరణ ఇచ్చినా వివాదం ముదురుతోంది.
వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ హీరో వివ్వక్సేన్ కు టీవి 9 యాంకర్ దేవికి మధ్య సోమవారం మాటల యుద్దం జరిగింది. 'అశోకవనంలో అర్జున కల్యాణం' చిత్రంతో విశ్వక్ సేన్ ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. విద్యా సాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బీవీఎస్ ఎన్ ప్రసాద్ సమర్పణలో బాబినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్ర ప్రమోషన్స్ ని ఇటీవలే ప్రారంభించారు.
అయితే సినిమాని మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం కోసం విశ్వక్ సేన్ అభిమాని ఆత్మ హత్య చేసుకోబోతున్నట్టుగా ప్రాంక్ వీడియోని నడీ రోడ్డుపై చేశారు. దీంతో వీడియో వైరల్ అయింది. ఈ వీడియోపై కొంత మంది అభ్యంతరాలు వ్యక్తం చేయగా ఓ లాయర్ హెచ్చార్సీకి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై టీవి9 లో ప్రత్యేకంగా డిబేట్ ని నిర్వహించారు. దీనికి హీరో విశ్వక్ సేన్ ని ఆహ్వానించారు.
అయితే డిబేట్ లో విశ్వక్ సేన్ ను 'పాగల్ సేన్' అని పిలుస్తారని, అతనొక 'డిప్రెస్డ్ మ్యాన్' అని యాంకర్ దేవి అనడంతో విశ్వక్ సేన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేవాడు.
దీంతో 'గెట్ ఆవుట్ ఆఫ్ మై స్టూడియో' అంటూ అరిచింది యాంకర్ దేవి. ఇంటర్వ్యూకు పిలిచి అవమానిస్తున్నారంటూ విశ్వక్ సేన్ 'F' పదాన్ని ఉపయోగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా వుంటే తాజాగా తెరాస నేత, మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విశ్వక్ సేన్ పై వీరంగం వేశారు. అతన్ని ఎవరూ హీరోగా గుర్తించడం లేదన్నారు. లైవ్ టెలీకాస్ట్ లో అసభ్య పదజాలంతో దూషించడం కరెక్ట్ గా లేదన్నారు. దీన్ని పోలీస్ వారు సుమోటోగా తీసుకుని విశ్వక్ సేన్ పై కేసు పెట్టాలన్నారు. లేదంటే మా మహిళా సంఘాలతో అతనిపై కేసు పెట్టిస్తాం. విశ్వక్ సేన్ ఇక నుంచైనా ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని, ఇలాంటి 'F' పదాన్ని ఉపయోగించిన అతన్ని అక్కడే చెప్పులతో కొట్టాల్సింది అంటూ ఫైర్ కావడం విశేషం.