Begin typing your search above and press return to search.
రేవంత్ పై రూ.25 కోట్ల బాంబేసిన కౌశిక్ రెడ్డి
By: Tupaki Desk | 3 Nov 2021 8:30 AM GMTసంచలన ఆరోపణ చేశారు టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం నేపథ్యంలో చేసిన ఈ ఆరోపణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమేకాదు.. కొత్త వాదనలకు తెర తీసేలా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ కాంగ్రెస్ టికెట్ ను రూ.25 కోట్లకు బీజేపీకి అమ్ముకున్నట్లుగా ఆయన ఆరోపించారు. దేశంలో మరెక్కడా లేని రీతిలో కాంగ్రెస్.. బీజేపీతో కలిసి పోటీ చేశాయని ఆరోపించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా పని చేసిన వేళ హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తే 62 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయని.. రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బల్మూరి వెంకట్ నర్సింగారావుకు డిపాజిట్ దక్కకపోవటాన్ని ప్రశ్నించారు. హుజూరాబాద్ మ్యాచ్ లో ప్రధాన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి చివరకు ఎక్స్ ట్రా ప్లేయరర్ గా నిలిచింది మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకటే అన్న ఆయన.. టికెట్ లభించినా నాయకుల నుంచి పూర్తిస్థాయి సహకారం అభించలేదన్నారు.
చాలామంది కాంగ్రెస్ నేతలు అసలు ప్రచారానికే రాలేదని.. ఒక్క మాటలో చెప్పాలంటే బల్మూరి ఒంటరిపోరు చేయాల్సి వచ్చిందన్నారు. చివరకు రెండు పొట్టేళ్ల మధ్య నలిగిన లేగదూడ మాదిరి డిపాజిట్ కోల్పోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇన్ని మాటలు మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి.. గత ఎన్నికల్లో హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్ల గురించి మర్చిపోయారా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు.
అప్పట్లో బలమైన నేతగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి కారణంగా కాంగ్రెస్ కు 62 వేల ఓట్లు వచ్చాయి. బల్మూరి బలం కౌశిక్ రెడ్డితో సమానం కాదన్న విషయాన్ని హుజూరాబాద్ లో ఎవరిని అడిగినా చెబుతారు. అలాంటప్పుడు తనకు వచ్చినన్ని ఓట్లు ఇప్పటి కాంగ్రెస్ అభ్యర్థికి రావు కదా. పార్టీ బలం కొంత.. అభ్యర్థి బలం మరికొంత పని చేస్తుందన్న విషయం రాజకీయాల్లో ఉన్న వారికి తెలీదా? అయితే.. రేవంత్ మీద ఘాటు ఆరోపణ ద్వారా ఓటమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేసీఆర్ కు.. తన మాటలతో సాంత్వన చేకూరేలా చేయటం కోసం పాడి కౌశిక్ రెడ్డి పడుతున్న పాట్లుగా పలువురు అభివర్ణిస్తున్నారు.