Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక ఏకగ్రీవమే .. వీరాభిమాని స్పెషల్ గా విషెష్ !

By:  Tupaki Desk   |   25 Nov 2021 6:33 AM GMT
ఎమ్మెల్సీగా  కవిత ఎన్నిక ఏకగ్రీవమే .. వీరాభిమాని స్పెషల్ గా విషెష్ !
X
తెలంగాణ రాష్ట్రంలో శాసనమండలి లోని 12 స్థానిక సంస్థల కోటా స్థానాలకు జరుగుతున్న ఎన్నిక లలో, మూడు చోట్ల టీఆర్‌ ఎస్ అభ్యర్థుల ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. బుధవారం జరిగిన నామినేషన్ల స్క్రూటినీ అనంతరం నిజామాబాద్‌ జిల్లాలోని ఒక స్థానంలో కల్వకుంట్ల కవిత, రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు పట్నం మహేందర్‌ రెడ్డి, శంభీపూర్‌ రాజు ఇద్దరే బరిలో మిగిలారు.

వీరి ఎన్నిక దాదాపు ఖరారైనా ఈ నెల 26న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసాక అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక కవిత విజయం లాంఛనమే అయిన సందర్భంలో ఆమెకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశాడు కవిత అభిమాని.

నిజామాబాద్‌ కు చెందిన టీఆర్ ఎస్ నాయకుడు సాయి ప్రసాద్ కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద పారాగ్లైడింగ్ ద్వారా భారీ ఫ్లెక్సీతో విషెస్‌ తెలిపారు. 40 అడుగుల కవిత ఫోటోతో కూడిన ఫ్లెక్సీని ఆకాశంలో ఎగరవేశారు. ఈ దృశ్యాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

అయితే ఎన్నికల్లో మరోవైపు అయితే ఆమెకు పోటిగా ఒకే ఒక్క ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ ధాఖలైంది. అదికూడా ఆ పార్టీ ఎంపీటీసిగా ఉన్న శ్రీనివాస్ అనే అభ్యర్థి ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. ఎంపీటీసీలను రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవవిగ్రహాలుగా చూస్తుందనే ఆలోచనతోనే తాను నామినేషన్ వేసినట్టు ఆయన చెప్పారు. తమ న్యాయమైన డిమాండ్స్ కోసం పోటిలో ఉంటానని స్పష్టం చేశారు.

అయితే శ్రీనివాస్ నామినేషన్‌కు సంబంధించి వివాదం కొనసాగుతోంది.కోటగిరి శ్రీనివాస్ రావు నామినేషన్ వేసిన నేపథ్యంలోనే ఆయనకు ఆయన్ను బలపరిచారని చెబుతున్న వారు మీడియా ముందుకు వచ్చారు. ఆయన్ను బలపరచిన వారు ముందుకు రాకపోవడంతో ఆయన నామినేషన్ రద్దు అయ్యె అవకాశాలు కనిపిస్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల బీజేపితో పాటు కాంగ్రెస్ పార్టీ బరిలో నిలవకపోవడంతో ఆపార్టీ గెలుపు నల్లేరు మీద నడక అవుతోంది.ఈ క్రమంలోనే నిజామాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పోటికి దూరంగా ఉంటామని ప్రకటించారు.

దీంతో అనుహ్యంగా కవితను రంగంలోకి దింపారు. ఎన్నికల నామినేషన్‌కు ఒక్కరోజు ముందుగానే ఆమె అభ్యర్థిత్వాన్ని ఖారారు చేశారు. కాగా అనూహ్య పరిస్థితుల్లో ఆమె ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు టి ఆర్ ఎస్ వర్గాల్లో మరో చర్చ జోరుగా సాగుతోంది. కవితకు మంత్రి పదవి పక్కా అని చర్చించుకుంటున్నారు. కేబినెట్‌ లో ఎలాగూ ఒక స్థానం ఖాళీగా ఉంది. దానికి తోడు ఎన్నికలకు ముందే సీఎం కేసీఆర్ మంత్రి మండలిని ప్రక్షాళన చేస్తారనే టాక్‌ కూడా బలంగా వినిపిస్తోంది.