Begin typing your search above and press return to search.
ఆర్టీసీ సమ్మెపై సంచలన నిజాన్ని చెప్పిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యే!
By: Tupaki Desk | 15 Oct 2019 10:20 AM GMTగడిచిన పదకొండు రోజులుగా తెలంగాణ ప్రభుత్వానికి చుక్కలు చూపించిన ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె వెనుక ఉన్నది ఎవరంటే.. ఇంకెవరు ఆర్టీసీ ఉద్యోగులు అని చెబుతారు. ఒకవేళ అలా చెబితే తప్పులో కాలేసినట్లేనని చెబుతున్నారు. ఆర్టీసీ సమ్మె వెనుక ఉన్నదెవరో తనకు తెలుసంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు జనగామ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.
ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె వెనుక టీఆర్ఎస్ నేతలే ఉన్నారని.. వారే సమ్మెను నడిపించినట్లుగా చెప్పి సంచలనంగా మారారు. సమ్మెకు ఆజ్యం పోస్తున్నది గులాబీ ఎమ్మెల్యేనని చెప్పారు. సమ్మె చేస్తున్న వారికి సహకరిస్తున్నది.. వారిని అన్ని విధాలుగా చేయూతను ఇస్తున్నది ఎవరో తనకు తెలుసని చెప్పారు.
తనకు తెలిసిన విషయాల్ని సీఎం కేసీఆర్ కు చెబుతానని.. సమ్మెకు సహకరించినపార్టీ నేతలు కూడా అధినేత ముందు బయటపెడతానని చెప్పారు. ఒకవేళ.. ముత్తిరెడ్డికి పేర్లు తెలిసి ఉంటే.. ఇంతకాలం దాచి పెట్టుకునే కన్నా.. వెనువెంటనే అధినేతకు ఎందుకు చెప్పనట్లు? సామాన్యుడికైతే సారు దర్శనం సాధ్యం కాదు. అధికారపార్టీ ఎమ్మెల్యే.. అందునా సారును ఉక్కిరిబిక్కిరి చేస్తూ చిరాకు తెప్పిస్తున్న ఈ ఇష్యూ వెనుక ఉన్నోళ్ల సమాచారం అందిస్తే.. సారు సీన్లోకి వచ్చేయటమే కాదు.. వెనువెంటనే ప్రగతి భవన్ కు పిలిపిస్తారు కదా? అది వొదిలేసి.. మీడియా ముందుకు వచ్చి రచ్చ చేయాల్సిన అవసరం ఏమిటి ముత్తిరెడ్డి?