Begin typing your search above and press return to search.
కేసీఆర్ పై అసభ్య ప్రచారానికి మైనర్లను వాడేస్తున్నారా?
By: Tupaki Desk | 12 April 2021 10:46 AM GMTరాజకీయం రంగు.. రుచి.. అన్ని మారిపోయాయి. గతానికి భిన్నంగా ఇప్పుడు సోషల్ మీడియా ఒక పెద్ద ఆయుధంలా మారింది. ఒక నేత ఇమేజ్ ను అమాంతం పెంచేయాలన్నా.. దారుణంగా దెబ్బ తీయాలన్నా సోషల్ మీడియాను వాడేస్తున్న వైనం ఎక్కువైంది. ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేయటంలో గతంలో మీడియా పాత్ర కీలకంగా ఉంటే.. ఇప్పుడు సోషల్ మీడియా ఇప్పుడా స్థానాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై విష ప్రచారానికి.. అసభ్య ప్రచారానికి మైనర్లను వాడేస్తున్న సంచలన విషయాన్ని కేసీఆర్ మీడియా సంస్థ నమస్తే తెలంగాణ వెల్లడించింది.
ఏడో తరగతి చదివే పద్నాలుగేళ్ల పిల్లగాడి పేరు మీద ఒక యూ ట్యూబ్ చానల్.. తొమ్మిది జీ మొయిల్ అకౌంట్లు.. 33 ఇన్ స్టా ఖాతాలతో పాటు.. 15 ఫేస్ బుక్ ఖతాలు ఉన్నాయని.. వాటిల్లో కొన్ని అమ్మాయిల పేర్లమీద కూడా నడుస్తున్న విషయాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. ఆ పిల్లాడి వివరాలన్ని తమ వద్ద ఉన్నాయని.. ఆ పిల్లవాడి భవిష్యత్తును పరిగణలోకి తీసుకొని తమ వద్ద ఉన్న వివరాల్ని పబ్లిష్ చేయటం లేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా సెల్ ప్రతినిధులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో.. మరిన్ని షాకింగ్ నిజాలు వెల్లడైనట్లు పేర్కొంది.
అంతేకాదు.. ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నంతనే.. బీజేపీ నాయకుడైన లాయర్ పోలీస్ స్టేషన్ కు రావటం చూస్తే.. ఆ పిల్లాడు ఎవరి చేతుల్లో ఉన్నాడో.. అర్థం చేసుకోవచ్చని పేర్కొంది. సీఎం కేసీఆర్ ఇమేజ్ డ్యమేజ్ చేయటానికి వీలుగా.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ కుయుక్తుల్ని వేస్తున్నట్లుగా ఆరోపించింది. ఒక మైనర్ చేత పెద్ద ఎత్తున ఖాతాలు తెరిపించి.. దాని ద్వారాసీఎం కేసీఆర్ పై అసభ్య ప్రచారాన్ని.. తప్పుడు ఫోటోలు.. వాస్తవానికి దూరంగా ఉండే వీడియోల్ని పోస్టు చేయిస్తున్న వైనం దారుణంగా చెబుతున్నారు. పిల్లలతో ఇలా చేయించటం వెనుక.. చట్టం నుంచి ఎదురయ్యే చిక్కుల నుంచి తప్పించుకోవటానికేనని చెబుతున్నారు.
మొబైల్ ఫోన్ ను చురుగ్గా వాడటం.. సోషల్ మీడియాను వినియోగించే వారిని గుర్తించి.. వారికిఫోన్లు కొనిపెట్టి.. వారి మనసుల్లో విషాన్ని నింపి సీఎం కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా దారుణ ఎత్తుగడకు దిగారని చెబుతున్నారు. పిల్లాడు చేసే తప్పులు.. వారి తల్లిదండ్రులకు ఏ మాత్రం అవగాహన లేదని చెబుతున్నారు. బీజేపీ నేతలు పిల్లల చేత ఇలాంటి తప్పుడుపనులు చేయిస్తున్నట్లుగా మండిపడుతున్నారు. మరి.. ఈ ఆరోపణలకు బీజేపీ ఏమని బదులిస్తుందో చూడాలి.