Begin typing your search above and press return to search.

నాయిని అంత్యక్రియల్లో పాడెమోసిన కేటీఆర్ .. చేతివాటం చూపించిన జేబుదొంగలు !

By:  Tupaki Desk   |   22 Oct 2020 4:50 PM GMT
నాయిని అంత్యక్రియల్లో పాడెమోసిన కేటీఆర్ .. చేతివాటం చూపించిన జేబుదొంగలు !
X
టీఆర్ ఎస్‌ సీనియర్ నేత, మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈ రోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. తమ ప్రియతమ నేతను కొల్పోయినందుకు కార్యకర్తలు కన్నీటి పర్యవంతం అయ్యారు. ఆయనను చివరసారిగా చూసేందుకు రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు హాజరై ఆయనకి నివాళ్లు అర్పించారు. ఇక నాయిని నర్సింహారెడ్డి ప్రభుత్వ లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ హాజరై , నాయిని పాడెను మోశారు. మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి జూబ్లీహిల్స్ మ‌హాప్రస్థానం వరకు అంతమియాత్ర కొనసాగింది. కొద్దిసేపటి క్రితమే అయన అంత్యక్రియలు ముగిసాయి.

నాయిని కార్మిక నాయకుడిగా రాజకీయ నేతగా ఆయన చేసిన పోరాటం చరిత్రలో మిగిలిపోతుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం తొలి, మలి దశ ఉద్యమాల్లో ఆయన చేసిన పోరాటం గొప్పది. ముఖ్యంగా టీఆర్‌ ఎస్ తో ఆయనకున్న అనుబంధంగా చిరస్మరణనీయం. నాయిని మరణవార్త విన్న సీఎం కేసీఆరే కంటతడి పెట్టారంటే టీఆర్‌ ఎస్ లో ఆయన పాత్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయన గత నెల 28 న కరోనా బారినపడి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ లో చేరారు. ఆ తరువాత నెగటివ్ వచ్చినా ,ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో కుటుంబసభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు.. అప్పటినుంచి వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటూ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు.

ఇదిలా ఉంటే , మాజీమంత్రి నాయిని నరసింహారెడ్డి మరణవార్త విని చాలామంది నేతలు , కార్యకర్తలు అయన గృహానికి చేరుకున్నారు. అందరూ ఓ కీలక నేతను కోల్పోయామనే బాధలో ఉన్న సమయంలో జేబు దొంగలు తమ పని చాలా సైలెంట్ గా కానిచ్చేశారు. నరసింహారెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నేతలు భావోద్వేగానికి గురౌతుంటే , ఇదే అదునుగా భావించి జేబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. పలువురు టీఆర్‌ ఎస్ నేతల జేబులని కొల్లగొట్టారు. అయితే ,ఓ నేత జేబులో నుంచి నగదును తీస్తుండగా అడ్డంగా బుక్కయ్యాడు. ఇంకేముంది సదరు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.