Begin typing your search above and press return to search.
కేసీఆర్ పై కొత్త ఒత్తిడి మొదలైంది
By: Tupaki Desk | 29 Jan 2017 10:38 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కొత్త ఒత్తిడి ప్రారంభమయిందని అంటున్నారు. రానున్న ఆరు నెలల్లో ఏడు ఎమ్మెల్నీ స్థానాలకు ఎన్నికలు జరుగనుండడంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అధికార పార్టీ కావడంతో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఎమ్మెల్సీ స్థానాలను ఆశిస్తున్న ఆశావాహులు మంత్రులు - పార్టీలోని సీనియర్ల వద్ద లాబీయింగ్ ప్రారంభించారు. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ రెట్టింపు అవుతుండడంతో, ఎవరికి ఎమ్మెల్సీ పదవులు దక్కుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో గులాబీ దశపతి కేసీఆర్ పై పాజిటివ్ ఒత్తిడి మొదలైందని తెలుస్తోంది.
తెలంగాణ శాసన మండలిలో రానున్న ఆరు నెలల్లో ఏడు స్థానాలు ఖాళీ కానున్నాయి - మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం మండలి సభ్యుడు జనార్ధనరెడ్డి - శాసనసభ్యుల కోటాలో పదవులు పొందిన మరో ఆరుగురు సభ్యుల పదవీ కాలం ముగియనుంది. దీంతో ఇప్పటినుంచే ముందస్తు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జరిగిన ప్రతి ఎన్నికల్లో అధికార టీఆర్ ఎస్ హవా కొనసాగుతూ వస్తోంది. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తమ హవా కొనసాగించి, గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని పార్టీ నేతలు డిసైడ్ అయ్యారు. ప్రస్తుత సంఖ్యా బలం ప్రకారం ఏడు స్థానాల్లో 6 స్థానాలు టీఆర్ ఎస్ గెల్చుకునే అవకాశాలు ఉన్నాయని, ఒక స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించే అవకాశం కనిపిస్తోందని అధికారపార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్సీ పదవులు కోసం ఆశావాహుల అప్పడే ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారంతా అధిష్టానం పెద్దల దగ్గర లాబీయింగ్ మొదలు పెట్టారు. సామాజిక వర్గీకరణలు తెరపైకి తీసుకొస్తున్నారు, ఎమ్మెల్సీ పదవే లక్ష్యంగా అందివచ్చే ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
త్వరలో పదవివిరమణ చేయనున్న ఎమ్మెల్సీలలో మాగం రంగారెడ్డి కాంగ్రెస్ వ్యక్తి. మిగిలిన ఎమ్మెల్సీలంతా ఇతర పార్టీల నుంచి అధికారపార్టీలో చేరిన వారే కావడంతో, తమకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని గులాబీదళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఒక మరొకవైపు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ, తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేసిన వారు తమకు అవకాశం కల్పించాలని మంత్రులను, పార్టీ కీలక నేతలను కోరుతున్నారు. దీంతో ఎమ్మెల్సీ పదపల కోసం ఆశావహుల సంఖ్య రెట్టింప కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/