Begin typing your search above and press return to search.

ఢిల్లీ పోయి పర్సులు ఖాళీ చేసుకున్న టీఆర్ఎస్ నేతలు

By:  Tupaki Desk   |   16 Dec 2022 11:30 AM GMT
ఢిల్లీ పోయి పర్సులు ఖాళీ చేసుకున్న టీఆర్ఎస్ నేతలు
X
ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఘనంగా తరలివెళ్లారు గులాబీ శ్రేణులు. సాధారణంగా ఢిల్లీ ఫ్లైయిట్ టికెట్ 3వేల నుంచి రూ.5వేల వరకూ సాధారణ రోజుల్లో ఉంటుంది. కానీ బీఆర్ఎస్ కు జోష్ నింపేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ చోటా మోటా నేతలందరూ పోలోమని బయలు దేరారు. వెళ్లడం అయితే వెళ్లారు కానీ.. ఇప్పుడు తిరిగి రావడానికి ఆపసోపాలు పడుతున్నారు. అగచాట్లు కొనితెచ్చుకుంటున్నారు. తిరుగు ప్రయాణ కష్టాలతో అగచాట్లు పడుతున్నారు.

బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభం కోసం ఢిల్లీ వెళ్లిన గులాబీ నేతలకు గురువారం, శుక్రవారం తిరిగి హైదరాబాద్ ప్రయాణం కావడానికి విమానం టికెట్లు చెక్ చేస్తే గుండె గుభేల్ మంటోంది. నాన్ స్టాప్ ఫ్లైట్ టికెట్ ఛార్జీలు రూ.25 వేల నుంచి 70 వేల వరకూ పలుకుతున్నాయి. దీంతో షాక్ అవుతున్న పరిస్థితి నెలకొంది. వన్ స్టాప్ ఫ్లయిట్ లో పోదామనుకున్నా అవి కూడా రూ.17వేలకు పైగానే ధర ఉండడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఖంగుతింటున్నారు.

శనివారం నాటికి టికెట్ల ధరలు కాస్త తగ్గి నాన్ స్టాప్ రూ.13వేలు.. వన్ స్టాప్ రూ. 11వేలకు దిగివచ్చాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీలో రెండు మూడు రోజులు ఉండాలంటే సామాన్య కార్యకర్తలకు పెను భారం అవుతోంది.

చలి తీవ్రంగా ఉండడం.. ఫ్లయిట్ టికెట్ల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో హోటళ్లకు గిరాకీ పెరిగింది. వారు హోటళ్ల ధరలు భారీగా పెంచారట.. సాధారణ రోజుల్లో 2వేల నుంచి 4వేలు చూపించే ధరలు ఇప్పుడు 5వేల నుంచి 8 వేలు అయ్యాయట..

దీంతో కొందరు సామాన్య కార్యకర్తలు రైళ్లో వెళ్లడానికి ట్రై చేశారు. కానీ రిజర్వేషన్లు దొరక్క వెనుదిరిగారు. దీంతో అందరూ ఎంపీలు, మంత్రుల సాయం కోరి ఎమర్జెన్సీ కోటా లేఖలు ఇవ్వాలని మొర పెట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ కోసం ఢిల్లీ వెళ్లిన నేతలంతా ఇప్పుడు తెలంగాణలోని తమ వారికి కాల్ చేసి గూగుల్ పే, ఫోన్ పే డబ్బులు చేయాలంటూ.. తమ వద్ద లేవని మొరపెట్టుకుంటున్నారు.

బీఆర్ఎస్ ప్రారంభోత్సం ఏమోకానీ ఇప్పుడు టీఆర్ఎస్ నేతల జేబులు మాత్రం ఖాళీ అయిపోయాయి. కేసీఆర్ కనీసం కార్యకర్తల కోసం ఒక ట్రెయిన్ అయినా బుక్ చేస్తే ఈ కష్టాలు తప్పేవని.. హాజరై మరుసటి రోజు వచ్చేవాళ్లమని అంటున్నారు. కేసీఆర్ జాతీయ కలలతో ఇప్పుడే ఇలాంటి పరిస్తితి ఉంటే మున్ముందు ఇంకా ఎలా ఉంటుందోనని అందరూ కంగారుపడుతున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.