Begin typing your search above and press return to search.
ఈ గులాబీ నేత మాటలకు బీప్ వేయాలంటే మాటలు కాదు
By: Tupaki Desk | 8 Nov 2021 4:57 AM GMTహుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎదురైన ఓటమి గులాబీ నేతల్ని తీవ్రమైన వేదనకు గురి చేస్తోందా? చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా గులాబీ బ్యాచ్ మొత్తం కిందా మీదా పడటమే కాదు.. ఈటల విజయంతో కొత్త ఆందోళన వారిలో వ్యక్తమవుతున్న వైనం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తోంది. హుజూరాబాద్ లో ఈటల గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సవాలు విసరటం తెలిసిందే. ఈటల విజయం సాధించిన తర్వాత నుంచి ఆయనకు ఫోన్ చేసి రాజీనామా ఎప్పుడు? అంటూ అడుగుతున్న వైనం గువ్వల బాలరాజుకు మాత్రమే కాదు.. ఆయన ఫాలోయర్స్ కు తెగ ఇబ్బందికరంగా మారింది.
ఇప్పటికే తనకు ఫోన్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాలరాజు వార్తల్లో వ్యక్తిగా మారారు. ఇదిలా ఉంటే.. ఆయన ఫాలోయర్స్ కొందరు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా.. కాంగ్రెస్.. బీజేపీ నేతలపై విరుచుకుపడిన వైనం షాకింగ్ గా మారింది. రాజకీయాల్లో విలువలు మిస్ అయి చాలా కాలమే అయినప్పటికీ.. మరీ ఇంత బరితెగింపుతో కూడిన వ్యాఖ్యలు ఏ మాత్రం సరికావంటున్నారు. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా బూతుల మీద బూతులు మాట్లాడటం.. సభ్య సమాజం వినలేని రీతిలో ఉన్న ఈ బూతులకు బీప్ లు వేయటం పెద్ద ప్రయాసగా మారిన పరిస్థితి.
బూతు పంచాంగం అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దగ్గర దగ్గర మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో వాడినన్ని బూతులు ఇటీవల కాలంలో ఏ రాజకీయ నేత.. మరోరాజకీయ నేతను ఉద్దేశించి అని ఉండరేమో? సవాలు విసిరిన తమ ఎమ్మెల్యేను రాజీనామా చేయాలంటూ ఫోన్లు చేస్తే బాగోదన్న హెచ్చరికతో పాటు.. గతంలో రేవంత్ రెడ్డి తాను కొడంగల్ లో ఓడితే.. రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారని.. కానీ ఆయన చేయలేదు సరికదా.. టీపీసీసీ చీఫ్ ఎలా అయ్యారు? రాజకీయ సన్యాసం అంటే పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టటమా? అంటూ ప్రశ్నించారు.
ఇక.. ఈటల రాజేందర్ ను ఉద్దేశించి సదరు నేత నోటి నుంచి వచ్చిన మాటలు మరింత దారుణంగా ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యల కారణంగా అనవసరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకోవటం ఖాయం. గెలిచినప్పుడు విర్రవీగటం.. ఓడినప్పుడు ఓటమిని తక్కువ చూపేలా విరుచుకుపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది. వినలేని దారుణమైన బూతులు మాట్లాడటం ద్వారా పైచేయి సాధించినట్లు కనిపించినా.. ప్రజల మనసుల్లో మాత్రం ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
రాజకీయాల్లో సవాళ్లు విసరటం.. అందుకు తగ్గట్లు వ్యవహరించకపోవటం లాంటివి మామూలే అయినా.. వాటికి తగ్గ కౌంటర్ ఇవ్వటం బాగుంటుంది కానీ.. నోటికి వచ్చినట్లుగా తిట్టిపోయటం మాత్రం సరికాదన్నది మర్చిపోకూడదు. ఇలా మాట్లాడటం ద్వారా సదరు నేతకు జరిగే నష్టం కంటే కూడా టీఆర్ఎస్ కు జరిగే నష్టమే తీవ్రంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించి.. తమ శ్రేణుల్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం టీఆర్ఎస్ అధినాయకత్వం మీద ఉందన్నది ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.