Begin typing your search above and press return to search.
తెలంగాణలో గులాబీ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో తెలుసా?
By: Tupaki Desk | 25 March 2020 5:30 PM GMTమేం ఉన్నదే మీ కోసం. నా ప్రజాజీవితం ప్రజలకు అంకితం. మీకోసం అవసరమైతే ప్రాణాల్ని పణంగా పెట్టేందుకు సైతం సిద్ధం. ఇలా చెప్పుకుంటే.. గుండెల్ని టచ్ చేసే మాటలు బోలెడన్ని చెప్పేటోళ్లలో ప్రజాప్రతినిధులు ముందుంటారు. మరి.. అలాంటి ఎంపీ.. ఎమ్మెల్సీ.. ఎమ్మెల్యేలు.. ఇంకా కిందిస్థాయిలో ప్రజలు ఎన్నుకున్న వారంతా కరోనావేళ ఏం చేస్తున్నారు? అన్నది చూస్తే.. షాకింగే.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నోళ్లు ఎవరైనా ఉన్నారంటే అది.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే. ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దన్న మాటను.. నూటికి నూరు శాతం ఫాలో అయిన వారిలో నేతలే ఎక్కువ. ఎవరికి వారు.. ఇళ్లకే పరిమితం కావటం.. గన్ మెన్లను ఇంట్లో ఉంచేసుకోవటం.. మాట వరుసకు సైతం బయటకొచ్చి మాట్లాడకపోవటం లాంటివన్ని వారికే సొంతం.
ప్రాణాంతక వైరస్ వాయి వేగంతో విస్తరిస్తున్న వేళ.. ప్రజల గురించి పట్టించుకోకుండా ఎవరిళ్లల్లో వాళ్లు ఉండిపోయిన వైనం చూస్తే.. ప్రజల కోసం నేతల కమిట్ మెంట్ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమైపోతుంది. నేనడుగుతున్నా.. ప్రజాప్రతినిధులంతా ఏం చేస్తారు? వారికి బాధ్యత లేదా? పోలీసులకు సాయంగా రోడ్ల మీద ఉండొద్దా? ప్రజలు నేరుగా ఎన్నుకున్న నాయకులంతా ఇళ్లల్లోనే ఉండిపోవటమా? అంటూ మీడియా సమావేశంలో కడిగిపారేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల నేపథ్యంలో.. ఎంతమంది బయటకు వస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.