Begin typing your search above and press return to search.

కేసీఆర్ హాట్ కేకులు.. ఎవరికోసం?

By:  Tupaki Desk   |   13 Jun 2020 3:00 PM GMT
కేసీఆర్ హాట్ కేకులు.. ఎవరికోసం?
X
గులాబీ దళపతి , తెలంగాణ సీఎం కేసీఆర్ రెండోసారి గద్దెనెక్కకా.. స్లో అండ్ స్టడీగా ముందుకు సాగుతున్నారు. మొదటి దఫాలో ఠంచనుగా నామినేటెడ్ పదవుల భర్తీ చేసిన కేసీఆర్ ఇప్పుడు సంవత్సరం దాటుతున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో ఖాళీ అయ్యే సీట్లపై నేతలు కన్నేశారు.

మరోవైపు తెలంగాణలో ఇప్పడు ఆ పదువులు హాట్ కేకుల్లా మారిపోయాయి. ఆ మూడు పదవుల కోసం 30 మంది పోటీ పడుతున్నారు.

టీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ పదవుల సందడి మొదలైంది. ఈ నెలాఖరుకు మూడు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఆ పదవుల కోసం నేతలంతా యాక్టివ్ అవుతున్నారు. ఎవరికి తోచిన దారిలో వారు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు.

కరోనా కారణంగా మిగతా నామినేటెడ్ పదువులు ఇప్పట్లో భర్తీ చేసే యోచనలో కేసీఆర్ లేడు. దీంతో ఇప్పుడు అందరిచూపు తెలంగాణలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ పదవులపై పడింది. ఈ పదవిని దక్కించుకునేందుకు రకరకాల మార్గాల్లో నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కేసీఆర్ కూతురు కవిత నామినేషన్ వేశారు. ఇప్పుడు గవర్నర్ కోటాలోని మూడు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నారు సీఎం కేసీఆర్.

ఈనెల 17తో మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి పదవీకాలం ముగుస్తోంది. ఆగస్టులో మరో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ది ముగుస్తోంది. ఇక కాంగ్రెస్ లో చేరి అనర్హత వేటుపడ్డ రాములునాయక్ ది కూడా ముగిసిపోయింది. ఈ మూడు స్థానాలకు అభ్యర్థుల కోసం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు.

ఈ మూడు స్థానాల్లో కర్నె ప్రభాకర్ కు రెన్యూవల్ అవకాశం ఉందని గలాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన టీఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉంటారు. నాయిని నర్సింహారెడ్డికి ఈసారి కేసీఆర్ ఇస్తాడో లేదో తెలియకుండా ఉంది. ఇక మూడో సీటులో కొత్త నేతకు అవకాశం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఈ మూడు పదవుల కోసం టీఆర్ఎస్ లో దాదాపు 30మందికి పైగా ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళా కోటాలో ప్రధానంగా తుల ఉమ, గుండు సుధారాణి, ఉమా మాధవరెడ్డి రేసులో ఉన్నారు. పురుషుల్లో చాలా మంది ఉండగా.. కేసీఆర్ కు దగ్గరగా ఉండే పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అంతిమంగా ఈ పదవులు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తిగా మారింది.