Begin typing your search above and press return to search.
మునుగోడులో టీఆర్ఎస్ కు 5 వేల ఓట్ల కలవరం
By: Tupaki Desk | 7 Oct 2022 6:20 AM GMTమునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. రాష్ట్రంలో తమ పార్టీ ఎదుగుతోందని చాటుకునేందుకు బీజేపీకి, రాబోయే ఎన్నికల్లో తమదే అధికారం అని చాటేందుకు కాంగ్రెస్ కు, వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్నప్పటికీ తమ పట్టు ఏమాత్రం చేజారలేదని చెప్పేందుకు టీఆర్ఎస్ కు మునుగోడు కీలకమైంది. దీనికితోడు ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీల్లో ఏది గెలిచినా వాటికి ఈ స్థానం బోనస్ గా నిలవనుంది. అదే జరిగితే.. బీజేపీకి నాలుగో ఎమ్మెల్యే దక్కుతారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారిన టీఆర్ఎస్ కు మరింత ఊపు దక్కుతుంది. అయితే, కాంగ్రెస్ కు గట్టి పట్టున్న మునుగోడును చేజిక్కించుకోవడం ఈ రెండు పార్టీలకు అంత సులువేం కాదు.
15 మంది మంత్రులకు బాధ్యతలు మునుగోడు నియోజకవర్గంలో ప్రస్తుతం ఏడు మండలాలున్నాయి. అవి చౌటుప్పల్, గట్టుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి. వీటిలో చండూరు,గట్టుప్పల్ కొత్తగా ఏర్పడ్డాయి. కాగా నియోజవకర్గానికి మొత్తం 15 మంది మంత్రులకు టీఆర్ఎస్ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. వీరిలో కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్ ఉన్నారు.
గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో టీఆర్ఎస్ మునుగోడుకు మరింత ప్రాధాన్యం ఇస్తోంది. ఇదే ఉమ్మడి జిల్లాలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలుపు లభించిన నేపథ్యంలో ఆ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని భావిస్తోంది. ఇక మునుగోడులో ఒక్కో ఎంపీటీసీ స్థానం పరిధిని యూనిట్ గా తీసుకుంది. వీటిలో ఎక్కువ ఓటర్లున్న సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని అదే సామాజిక వర్గానికి చెందిన 15 మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీబీ, జడ్పీ చైర్మన్లు ఇలా అందరూ కలిపి 71 మంది ఇన్ చార్జి బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఆయనకు ప్రత్యేకం మొత్తం 15 మంది మంత్రులకు బాధ్యతలు ఇచ్చినా.. వీరిలో ఆర్ధిక మంత్రి హరీశ్ రావుకు అప్పగించిన బాధ్యతలు ప్రత్యేకంగా నిలిచాయి. హరీశ్ కు మర్రిగూడ మండలం ఇన్ చార్జిగా బాధ్యతలు ఇచ్చారు. ఇదే మండలంలో కిష్టరాయిన్ పల్లి, చర్లగూడెం రిజర్వాయర్లు ఉన్నాయి. డిండి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా వీటిని చేపట్టారు. అయితే, ఈ ప్రాజెక్టులో భాగమైన కిష్టరాయిన్ పల్లి, చర్లగూడెం జలాశయాల నిర్మాణంతో పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వీటి నిర్వాసితులు ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏకంగా ఆర్డీవోనే తమ నిరసన దీక్షా శిబిరంలో కూర్చోబెట్టారు. ప్రభుత్వంపైనా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం మంజూరులో సర్కారు తీరుపై ధ్వజమెత్తారు.
వారి ఓట్లు 5 వేలు.. మర్రిగూడ మండలంలో డిండి రిజర్వాయర్ నిర్వాసితుల ఓట్లు 5 వేలపైగానే ఉన్నాయి. వీరంతా తమకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ తరహాలో పరిహారం కోరుతున్నారు. ఈ తరహా పరిహారం కోసమే ఇటీవల రోజుల పాటు ఆందోళనలు, నిరాహార దీక్షలు సాగించారు. అయితే, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఏమీ రాలేదు. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు నేతలు సంఘీభావం ప్రకటించినా పూర్తిస్థాయిలో వారి డిమాండ్లు నెరవేరలేదు. మరోవైపు ఉప ఎన్నిక రావడంతో 5 వేల మంది నిర్వాసితుల ఓట్లు కీలకంగా మారాయి.నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల ఓట్లు ఉన్నాయనుకుంటే అందులో రెండున్నర శాతం ఓట్లు వీరివే. అంతేకాక నిర్వాసితుల ప్రభావం మిగతా నిర్వాసితులతో పాటు ఓటర్లపైనా పడుతుంది. దీంతోనే అధికార టీఆర్ఎస్ ఇప్పుడు కలవరపడుతోంది.
అందుకే హరీశ్ కు బాధ్యతలు మంత్రి హరీశ్ రావు మునుగోడు ఉప ఎన్నికలో మర్రిగూడ మండల ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు. సమస్యలను పరిష్కరించడంలో ఆయనది అందవేసిన చేయి. ప్రజలకు కూడా హరీశ్ హామీ ఇచ్చారంటే చాలా భరోసా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నిర్వాసితులకు అండగా ఉంటామని చెప్పేందుకు మర్రిగూడ మండల బాధ్యతలను ఆయన అప్పగించినట్లు తెలుస్తోంది. చూడాలి మరి.. నిర్వాసితులను హరీశ్ ఏం చెప్పి చల్లబరుస్తారో..?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.