Begin typing your search above and press return to search.
ఓట్ల కోసమే టీఆర్ఎస్ క్యూ కట్టిందా ?
By: Tupaki Desk | 29 May 2022 12:30 PM GMTఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఏపీలో హడావుడి జరిగిందంటే అర్ధముంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మహానాడు వేదిక ఇందుకు కేంద్ర బిందువుగా మారింది. పార్టీ నేతలు తమ ప్రాంతాల్లో ఎన్టీయార్ జయంతి సంరద్భంగా హడావిడి చేయటం సహజమే. మరి తెలంగాణాలో కూడా ఎందుకింత హడావుడి జరిగింది. అందులోను ఎన్టీయార్ ఘాట్ దగ్గరకు టీఆర్ఎస్ మంత్రులు, నేతలు ఎందుకు క్యూకట్టారు.
గడచిన ఎనిమిదేళ్ళుగా ఎప్పుడు కనబడని టీఆర్ఎస్ నతలు ఇపుడే ఎందుకు కనిపించారు ? ఎందుకు కనిపించారంటే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అని అర్ధమైపోతోంది. ఎన్టీయార్ ఘాట్ దగ్గర మంత్రులు, టీఆర్ఎస్ ఎంఎల్ఏలు, నేతలు పోటీపడి మరీ అంజలి ఘటించటమే విచిత్రంగా ఉంది. సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా ఎన్టీయార్ ది ప్రత్యేక శైలి అని చెప్పాలి. ఎన్టీయార్ పాలించిన కాలం తక్కువే అయిన మండల వ్యవస్ధను ఏర్పాటుచేయటం లాంటి కొన్ని నిర్ణయాల వల్ల జనాల మనసుల్లో చిరస్ధాయిగా నిలిచిపోయారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ వాళ్ళెవరు ఎన్టీయార్ జయంతిని ఏ రోజూ పట్టించుకోలేదు. ఇప్పుడింత హడావుడి చేసింది వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అని అర్ధమైపోతోంది.
సీమాంధ్రకు చెందిన ఎన్టీయార్ అభిమానులు తెలంగాణాలో చాలామందున్నారు. నిజానికి తెలంగాణాలోనే టీడీపీ ఒకపుడు బలంగా ఉండేది. అలాంటిది ప్రత్యేక రాష్ట్రం తర్వాత వ్యూహాత్మకంగా పార్టీని కేసీయార్ బలహీనం చేసేశారు. టీడీపీ వాళ్ళలో అత్యధికులను కేసీయార్ లాగేసుకున్నారు.
ఇపుడు ఎన్టీయార్ ఘాట్ దగ్గర హడావుడి చేసిన వాళ్ళల్లో అత్యధికులు టీడీపీలో నుంచి టీఆర్ఎస్ లోకి ఫిరాయించినవారే. సీమాంధ్రుల ఓట్లు వేయించుకోవటం కోసమే ఎన్టీయార్ శతజయంతి సందర్భంగా హడావుడి జరిగిందని అర్ధమైపోతోంది.
కేసీయార్ అనుమతి లేకుండానే మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు ఎన్టీయార్ ఘాట్ దగ్గర హడావుడి చేసుంటారా ? ఒకవైపు కేసీయార్ ప్రభుత్వంపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోతోందని ప్రచారం జరుగుతోంది. అందుకనే ఎన్టీయార్ పేరుతో టీఆర్ఎస్ వాళ్ళు హడావుడి చేస్తున్నదనే ప్రచారం పెరిగిపోతోంది.