Begin typing your search above and press return to search.
ఫైర్ బ్రాండ్ తోలు తీస్తానన్న బాల్క సుమన్!
By: Tupaki Desk | 1 May 2019 10:43 AM GMTరాజకీయ నేతల నోటి వెంట వచ్చే మాటలు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. రాజకీయ నేతల్లో ఫైర్ బ్రాండ్ నేతలు వేరుగా ఉంటారు. వీరి మాటలకు హద్దు ఆపూ ఉండదు. టార్గెట్ చేసిన వారిపైనా నిప్పులు చెరిగేలా వ్యాఖ్యలు చేసే టాలెంట్ వీరి సొంతం. వీరి నోట్లో నోరు పెట్టటానికి మించిన తప్ప ఉండదన్నట్లుగా వీరి వ్యాఖ్యలు ఉంటాయి. మిగిలిన వారితో పోలిస్తే.. వీరి చర్మం దళసరిగా ఉండటమే కాదు.. నాలుక ఇష్టం వచ్చినట్లుగా తిరిగేస్తుంటుంది. అదే సమయంలో తమ ప్రత్యర్థులు చేసే ఘాటు వ్యాఖ్యలకు అంతే కసిగా రిటార్ట్ ఇవ్వటం కనిపిస్తుంటుంది.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారటం తెలిసిందే. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా టీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ నేత బాల్క సుమన్ స్పందించారు. రేవంత్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసినట్లుగా విరుచుకుపడిన ఆయన.. రేవంత్ ఒక పొలిటికల్ టెర్రరిస్ట్ అని.. బ్లాక్ మొయిలర్ అని విమర్శించారు. రేవంత్ ను ఆయన ఇంట్లోని వారు ఎలా భరిస్తున్నారో అర్థం కావట్లేదన్న ఆయన.. ఇంటర్ బోర్డు టెండర్లకు.. ఐటీ శాఖకు లింకేమిటి? అంటూ ప్రశ్నించే ప్రయత్నం చేశారు.
కేటీఆర్ మీద ఈగ వాలినా ఊరుకోమన్నట్లుగా ఫైర్ అయిన బాల్క సుమన్.. గ్లోబరీనాతో కేటీఆర్ కు ఎలాంటి సంబంధం లేదంటూ సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఎల్ వన్ గా రావటంతో గ్లోబరీనాకు అనుమతులు ఇచ్చింది ఆనాటి విద్యా శాఖామంత్రి కడియం శ్రీహరి అని పేర్కొన్నారు. కేటీఆర్ పై రేవంత్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలన్నారు.
24 గంటల వ్యవధిలో కేటీఆర్ మీద ఆరోపణలకు ఆధారాలు చూపించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఇంటర్ బోర్డులో కార్పొరేట్ మాఫియా ఉంటుందన్న అంశంలో ఆధారాలు చూపించకుంటే.. రేవంత్ తోలు తీస్తానని హెచ్చరించారు. ఒక ఫైర్ బ్రాండ్ మీద మరో ఫైర్ బ్రాండ్ విరుచుకుపడితే.. మాటలు ఇంత తీవ్రంగా ఉంటాయన్న మాట.