Begin typing your search above and press return to search.
ఒంటి చేత్తో టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ఫీట్..బంతితో అదరగొట్టేశారుగా?
By: Tupaki Desk | 5 Jan 2020 4:58 AM GMTటీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలకు కాస్త భిన్నం నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో ఒక చేతిని కోల్పోయారు. అయినప్పటికీ ఆయన ఉత్సాహం మిగిలిన ఎమ్మెల్యేలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంటుందని చెప్పాలి. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడించటం ద్వారా సంచలనంగా మారిన ఆయన.. తాజాగా చేసిన టిక్ టాక్ వీడియోతో విపరీతంగా వైరల్ అవుతున్నారు.
ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి టాలెంట్ కు ఫిదా అవుతున్నారు. పది సెకండ్ల నిడివి ఉన్న టిక్ టాక్ వీడియో వైరల్ గా మారింది. ఒంటి చేత్తో రెండు బంతుల్ని గాల్లోకి ఎగురవేస్తూ.. వాటిని ఒడుపుగా పట్టుకుంటూ చేసిన ఫీట్ వావ్ అనేలా ఉందని చెప్పాలి.
చిన్నతనంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేయి పోగొట్టుకున్న ఆయన.. ఒక చేత్తోనే చేస్తున్న ఫీట్..దానికి బ్యాక్ గ్రౌండ్ లో ‘అనుకుంటే సాధించనిది ఏమున్నది.. మనిషి అనుకుంటే సాధించనిది ఏమున్నదంటూ స్ఫూర్తిని రగిలించేలా ఉన్న పాట మరింత ఉత్సాహాన్ని నింపేలా ఉంది.
ఎమ్మెల్యేగా గెలుపొందటం తన జీవితంలో అత్యంత సంతోషకరమైన ఘటనగా చెప్పుకునే భూపాల్ రెడ్డి.. చిన్నతనంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేయికి గాయమైతే.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చేతిని తొలగించారని.. అప్పుడెంతో బాధ కలిగిందని గతాన్ని గుర్తు చేసుకుంటారు. తర్వాత కుమార్తె పుట్టిన తర్వాత నడవలేదని తెలిసిన తర్వాత చాలా బాధ కలిగిందని.. కాకుంటే ఆమె నడుస్తుందన్న నమ్మకం తనకుందని చెప్పే ధీమా చూస్తే.. కచ్ఛితంగా ఆమె నడుస్తుందన్న ఆత్మవిశ్వాసం కలుగక మానదు.