Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే పౌరసత్వం రద్దు చేస్తూ హోం శాఖ నిర్ణయం
By: Tupaki Desk | 5 Sep 2017 4:43 PM GMTతెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలింది. వేములవాడ నుంచి తెరాస ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నుంచి చెన్నమనేని రమేష్ కు లేఖ అందింది. వేములవాడ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే తప్పుడు పత్రాలతో గెలిచిన చెన్నమనేని రమేష్ భారతదేశ పౌరసత్వన్ని రద్దు చెయ్యాలంటు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన అది శ్రీనివాసు పిటిషన్ ను విషయంలో కేంద్ర హోంశాఖ ఈ వివరాలు అందించింది.
రమేష్ బాబు 1993లో భారత దేశ పౌరసత్వన్ని రద్దు చేసుకొని జర్మనీ దేశ పౌరసత్వాన్ని పొందారు. తిరిగి 2009లో భారత దేశ పౌరసత్వాన్ని తీసుకున్నారు. అయితే తప్పుడు ధ్రువపత్రాలు చూపించి భారత దేశ పౌరసత్వాన్ని పొందారని అదే నియోజకవర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ హైకోర్టులో కేసు వేశారు. భారత పౌరసత్వం పొందేందుకు 365 రోజులు దేశంలో ఉండాలనే నిబంధన ఉందని అయితే అంతకు ముందు 365 రోజులు అయన భారత దేశంలో లేరని పేర్కొన్నారు. వాదనలు విన్న ఉమ్మడి హైకోర్టు తప్పుడు ద్రువపత్రాలు చూపించారని ఏకీభవించింది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రమేష్ బాబు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 2016 ఆగస్టు 11న సుప్రీం కోర్టు ఆరు నెలలో కేసును పూర్తి చేయాలని కేంద్ర హోమ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పుడు హోంశాఖ మరింత గడువు కోరింది. అయితే గడువు పూర్తి అయినందున కేంద్రహోంశాఖ క్లారిటీ ఇచ్చింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి చెన్నమనేని రమేష్ ఇవాళ లేఖ అందుకున్నారు. మరోసారి సంయుక్త కార్యదర్శి వద్ద సవాలు చేయాలని భావిస్తున్నట్లు చెన్నమనేని రమేష్ మీడియాకు తెలిపారు.