Begin typing your search above and press return to search.
కేసీయార్..పాన్ ఇండియా సూపర్ స్టారా ?
By: Tupaki Desk | 3 July 2022 12:14 PM GMTరాజకీయాల్లో వ్యక్తిపూజ తారాస్ధాయికి చేరుకుంటున్నది. అన్నీ హద్దులను దాటేసి ఇపుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నది. దీనికి తాజా నిదర్శనం టీఆర్ఎస్ ఎంఎల్ఏ జీవన్ రెడ్డి వ్యాఖ్యలే. రెడ్డి మాట్లాడుతు కేసీయార్ పాన్ ఇండియా పొలిటికల్ సూపర్ స్టారన్నారు. కేవలం తెలంగాణాకు మాత్రమే పరిమితమైన కేసీయార్ పాన్ ఇండియా పొలిటికల్ సూపర్ స్టార్ ఎలాగ అవుతారో ఎంఎల్ఏనే చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ అనేది సినిమా ప్రపంచానికి సంబందించిన పదం.
అన్నీ భాషల్లోను మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో, అన్నీ భాషల్లోను సదరు హీరో నటించిన సినిమాలు మంచి విజయం సాధిస్తుంటే పాన్ ఇండియా స్టార్ అని అంటున్నారు. మరి ఆ పద ప్రయోగం రాజకీయాల్లో ఎలా అన్వయించగలుగుతారు. కేసీయార్ కేవలం తెలంగాణాకు మాత్రమే పరిమితమైన నేత. తెలంగాణా దాటి ఇంకేరాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీయే లేదు. కనీసం పొరుగు రాష్ట్రం ఏపీలో కూడా టీఆర్ఎస్ ను పట్టించుకునే వారేలేరు.
అలాంటిది కేసీయార్ ను పాన్ ఇండియా పొలిటికల్ సూపర్ స్టార్ అని చెప్పుకోవటమే చాలా విచిత్రంగా ఉంది. తమ ప్రభుత్వాన్ని కూలుస్తామని పిచ్చికూతలు కూస్తే ఖబడ్దార్ అంటు వార్నింగ్ కూడా ఇచ్చారు. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఎవరన్నారు ? సౌత్ ఇండియా జోలికివస్తే మౌత్ పగులుతుందని వార్నింగ్ ఇచ్చారు. సౌత్ ఇండియా జోలికొస్తే బీజేపీ మౌత్ పగలటం ఏమిటో ఎంఎల్ఏకే తెలియాలి. ఇప్పటికే కర్నాటకలో బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణాలో బీజేపీకి నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎంఎల్ఏలున్న విషయం మరచిపోయారేమో.
ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని దోచుకున్నట్లు నరేంద్రమోడి ఆధ్వర్యంలోని నార్త్ ఇండియా కంపెనీ తెలంగాణాను దోచుకునేందుకు హైదరాబాద్ వచ్చినట్లు మండిపడ్డారు. తెలంగాణాను దోచుకునేందుకు వచ్చిన హైదరాబాద్ కంపెనీ పేరు మాత్రం ఎంఎల్ఏ చెప్పలేదు. కంపెనీ వచ్చినపుడు మరి వాళ్ళ ప్రభుత్వం చూస్తు ఎందుకు ఊరుకున్నదో ఎంఎల్ఏకే తెలియాలి.