Begin typing your search above and press return to search.

ముత్తిరెడ్డి.. మనకెందుకీ రచ్చ.. టీఆర్ఎస్ లో హాట్ టాపిక్

By:  Tupaki Desk   |   2 March 2021 10:30 AM GMT
ముత్తిరెడ్డి.. మనకెందుకీ రచ్చ.. టీఆర్ఎస్ లో హాట్ టాపిక్
X
మొదటి టర్మ్ తో పోలిస్తే.. రెండో సారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీఆర్ఎస్ నేతలు పలువురు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అంతేకాదు..కొద్ది మంది నేతల పేర్లు తరచూ చర్చకు వస్తున్నాయి. ఆ కోవలోకే వస్తారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. ఇప్పటికే వివాదాస్పదమన్న ముద్ర వేయించుకున్న ఆయనకు సంబంధించిన లీలలు మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ఆయన పేరుతో వచ్చింది.

జనగామ జిల్లాలోని హన్మంతాపూర్ వద్ద ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఫామ్ హౌస్ ఉంది. అయితే.. అక్కడకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేదట. దీంతో.. రైతుల పోలాలకు గురి పెట్టిన అధికార పార్టీ ఎమ్మెల్యే.. హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డు పక్కన మొక్కలు నాటాలని.. అందుకు విస్తరణ చేపడుతున్నట్లుగా చెప్పారట. గత జనవరిలో పోలాల్లోని పంటల్ని తొలగించి.. రోడ్డు మధ్య నుంచి అటు ఇటుఇటు కలిపి 45 అడుగుల వరకు పొలాల్ని చదును చేయించారు. దగ్గరుండి మొక్కలు నాటించారు.

అయితే.. దీనికి ఎలాంటి అనుమతులు లేవని.. తమ పొలాల్లోకి అక్రమంగా జేసీబీలను తీసుకొచ్చి భూమిని చదును చేసినట్లుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటున్నారు. అధికారులు పోలీసులు అందరూ ఎమ్మెల్యేకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ వారు కోర్టును ఆశ్రయించాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. దీంతో.. మళ్లీ సీన్లోకి వచ్చిన ముత్తిరెడ్డి.. బుజ్జగింపులకు దిగి.. పరిహారం ఇస్తానని చెబుతున్నారట. దీనిపై తమకు న్యాయం జరగాలని బాధితులు వాపోతున్నారు. చేతిలో అధికారం ఉన్న వేళ.. ఇలాంటి పనులు చేయటం ఎందుకు? అనవసరమైన వివాదాల్లోకి వెళ్లి పేరు చెడగొట్టుకోవటం ఎందుకన్న మాట అధికార పార్టీ నేతల నోటి వెంట వినిపిస్తోంది.