Begin typing your search above and press return to search.
హాట్ టాపిక్: షర్మిల భర్తతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటి?
By: Tupaki Desk | 9 Aug 2021 7:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో మరో అనుకోని పరిణామం చోటుచేసుకుంది. అధికార టీఆర్ఎస్ పార్టీని విపరీతంగా విమర్శిస్తున్న వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త వద్దకు టీఆర్ఎస్పార్టీ ఎమ్మెల్యే రావడం చర్చనీయాంశమైంది. ఎందుకు కలిశాడు.. పార్టీ మారుతాడా? ఏంటా కథ అన్నది ఆసక్తి రేపుతోంది.
వైఎస్ఆర్ టీపీ అధినేత షర్మిల భర్త బ్రదర్ అనిల్ తో టీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదివారం భేటి అయినట్లు సమాచారం. ఈ భేటి లోటస్ పాండ్ లో కాకుండా వేరే ప్రాంతంలో జరిగినట్లు సమాచారం.
కొద్దిరోజులుగా బ్రదర్ అనిల్ తో రాజయ్య తరచూ భేటి అవుతున్నారని వైఎస్ఆర్ టీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ భేటి మతపరమైందా? లేదా రాజకీయ పరమైందా? అన్న దానిపై స్పష్టత లేదంటున్నారు.
కొద్దిరోజులుగా టీఆర్ఎస్ లో రాజయ్య అసంతృప్తిగా ఉంటున్నారు. సీఎం కేసీఆర్ తొలి కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా చేసి ఆరోపణలతో రాజయ్య తొలగించబడ్డాడు. అనంతరం 2018 ముందస్తు ఎన్నికల్లో అసలు రాజయ్యకు టికెట్ దక్కదని అనుకున్నా ‘కడియం శ్రీహరి’ని పక్కనపెట్టి మరీ కేసీఆర్ టికెట్ ఇచ్చాడు. రాజయ్య గెలిచాడు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు భర్తతో తరచూ భేటికావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ మారుతాడా? లేక పాత మతపరమైన స్నేహాల అన్నది తేలాల్సి ఉంది.