Begin typing your search above and press return to search.
తెలంగాణ సీఎం కేటీఆర్.. అతి త్వరలోనే అంటున్న ఎమ్మెల్యే
By: Tupaki Desk | 24 Dec 2020 10:19 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ ను ప్రకటించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కొంత కాలంగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. టీఆర్ ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చినప్పుడే ఈ ఊహాగానం నిజమవుతుందని అందరూ భావించారు. కానీ.. అందరి అంచనాలకు కామా పెడుతూ మరోసారి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ఇప్పుడు ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరోసారి కేటీఆర్ అంశాన్ని తెరపైకి తెచ్చాయి.
మార్చిలోపే నట..!
కేటీఆర్ సీఎం కుర్చీ ఎక్కడానికి ఎక్కువ కాలం కూడా పట్టదని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్ చెప్పారు. డోర్నకల్ మున్సిపాలిటీకి 15వ ఆర్థిక సంఘం నిధులతో మంజూరైన రెండు ట్రాక్టర్లను బుధవారం ప్రారంభించిన అనంతరం రెడ్యానాయక్ మాట్లాడారు. ఈ మధ్య తాను మంత్రి కేటీఆర్‌ని కలిసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. కురవి మండలం సీరోలు గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని, నర్సింహులపేటలో పీహెచ్‌సీ నెలకొల్పాలని కేటీఆర్‌ని కోరినట్లు చెప్పారు. అలాగే డోర్నకల్‌కు ప్రభుత్వ జూనియర్ కాలేజీ మంజూరు చేయాలని కూడా కోరానన్నారు. ఈ సందర్భంగా కాబోయే సీఎం కేటీఆర్ అంటూ రెడ్యానాయక్ వ్యాఖ్యానించారు. రానున్న మార్చిలోపు కేటీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉందని చెప్పారు ఎమ్మెల్యే.
మొదలైన చర్చ..
కేటీఆర్ సీఎం అనే చర్చ రెండేళ్లుగా సాగుతోంది. అయితే.. కొడుకును టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలకే పరిమితం చేశారు కేసీఆర్. గత లోక్ సభ ఎన్నికల్లో అనుకున్న విధంగా ఫలితాలు వస్తే.. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసి, కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలపై ఫోకస్ చేస్తారనే చర్చ సాగింది. కానీ.. రిజల్ట్ రివర్స్ కొట్టింది. దాంతో అంతా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు.. ఆ పార్టీ ఎమ్మెల్యే చెప్పడమే కాకుండా.. టైం కూడా వెల్లడించడంతో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.