Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డి..నట‌న‌లో క‌మ‌ల్‌ హాస‌న్‌!

By:  Tupaki Desk   |   30 Jan 2018 5:08 PM GMT
కోమ‌టిరెడ్డి..నట‌న‌లో క‌మ‌ల్‌ హాస‌న్‌!
X
న‌ల్లగొండ జిల్లాకు చెందిన రాజ‌కీయ‌వేత్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య ఉదంతం మ‌లుపు తిరుగుతోంది. ఈ ఎపిసోడ్‌లో విప‌క్ష పార్టీల‌కు టార్గెట్‌గా మారిన టీఆర్ ఎస్ నేత -నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎట్ట‌కేల‌కు మీడియాతో మాట్లాడారు. నల్లగొండలో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌ లో శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చేసిన ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్దమేనని తెలిపారు. త‌న ఎన్‌ కౌంట‌ర్‌ కు ప్ర‌ణాళిక‌లు వేస్తున్నార‌ని ఆరోపించారు.

`న‌న్ను రౌడీగా - గుండాగా చిత్రీకరించే ప్రయత్నాన్ని కోమటిరెడ్డి చేస్తున్నారు. నేను శాసనసభ్యుడైన తరువాత ఎన్ని హత్య కేసులు నామీద నమోదయ్యాయో కోమటిరెడ్డి నిరూపించాలి` అని సవాల్ విసిరారు.  `శ్రీనివాస్‌ ను ఇంటి నుంచి పిలిపిచ్చిన గోపి కోమటిరెడ్డికి అత్యంత సన్నిహితుడు. చిట్యాల ఎంపీపీ ఎలక్షన్లలో ఘర్షణకు మూల కారణం కోమటి రెడ్డి వెంకటరెడ్డి. రాజకీయంగా ఎదుర్కోలేకే కోమటిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. నక్సలైట్ జీవితాన్ని వదిలి ప్రజలచే ఎన్నికై ప్రజా సేవకు అంకితమయ్యాను. దళితుడిని కావడం వల్లే నాపై ఆరోపణలు చేస్తున్నారు` అని ఆవేదన వ్యక్తం చేశారు. `శ్రీనివాస్‌ ను హత్య చేసింది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. రఘుమారెడ్డిపై దాడి చేసింది కోమటిరెడ్డి కాదా? హత్యా రాజకీయాలకు తెర లేపి కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ పబ్బం గడుపుతున్నారు. కార్యకర్తలు ఎదిగితే ఓర్వలేని గుణం కోమటిరెడ్డిది. నటనలో కోమటిరెడ్డి కమల్‌ ను మించిపోయారు` అని ఎద్దేవా చేశారు.

`కాంగ్రెస్‌పార్టీ రక్త దాహ ఫలితమే బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య. సూర్యపేట - కోదాడలో రక్త చరిత్రను రాశారు. ఓటమి భయంతోనే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డారు. నల్లగొండ జిల్లాలో రౌడీ షీటర్‌ లకు కేరాఫ్ అడ్రస్ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. జానారెడ్డి నియోజకవర్గంలో పదుల సంఖ్యలో హత్యలు చేయించారు. పోలీసులు కాల్‌డేటా ఆధారంగా సమగ్రంగా విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది` అని తెలిపారు. `నయీమ్ అడ్డాగా నల్లగొండను మార్చింది కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. నయీమ్‌ను పెంచి పోషించింది కోమటిరెడ్డి బ్రదర్స్. బ్రహ్మణపల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తుంది టీఆర్‌ ఎస్ పార్టీ అయితే చెప్పుకు తిరిగేది కోమటిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ నకిరేకల్‌ లో గల్లంతయ్యింది. అందుకే వీరేశంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు` అని మండిప‌డ్డారు.

న‌న్ను ఎన్‌కౌంటర్ చేయాలని అంటున్నార‌ని  వేముల వీరేశం ఆవేద‌న వ్య‌క్తం చేశారు. `ప్రజాక్షేత్రంలో గెలవలేకే కాంగ్రెస్ నాయకలు నా హత్యకు కుట్ర చేస్తున్నారు. రామకృష్ణకు ఇచ్చిన సుపారి - మీడియాలో వచ్చిన వార్తలు, వీహెచ్ మాట్లాడిన తీరు ఆధారంగా కోర్టులో కాంగ్రెస్ నాయకులను ఎదుర్కొంటాం. చిరుమర్తి లింగయ్య మీద కూడా కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హత్య కుట్ర చేస్తున్నడు. నేను బతికి వున్నంత కాలం ప్రజల కోసమే. సీబీఐ విచారణతో పాటు నార్కో ఎనాలసిస్ టెస్ట్‌కు కూడా నేను సిద్ధం. కోమటి రెడ్డి బ్రదర్స్ అందుకు సిద్దమేనా, మూడున్నర సంవత్సరాల కాల్‌ డేటా బయటపెట్టాడానికి నేను సిద్దం. కోమటిరెడ్డి సిద్దామా? అని ప్రశ్నించారు.