Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యేలు బీజేపీలోకి.. టీఆర్ఎస్‌ లో కొత్త టెన్ష‌న్‌

By:  Tupaki Desk   |   5 Nov 2021 8:49 AM GMT
ఆ ఎమ్మెల్యేలు బీజేపీలోకి.. టీఆర్ఎస్‌ లో కొత్త టెన్ష‌న్‌
X
ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కం గా తీసుకుని విజ‌యం కోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టి కీ హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ లో అధికార టీఆర్ఎస్ పార్టీ కి ఎదురు దెబ్బ తగిలింది. సీఎం కేసీఆర్‌ కు స‌వాలుగా నిలిచిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఏడో సారి ఎమ్మెల్యే గా గెలిచి త‌న బ‌లాన్ని చాటారు. ఎన్ని ప్ర‌లోభాలు పెట్టినా లొగ్గ‌ని అక్క‌డి ఓట‌ర్లు ఆత్మ‌ గౌర‌వ నినాదం తో ముందుకు సాగిన ఈట‌ల వైపే నిలిచారు. బీజేపీ త‌ర‌పున పోటీ చేసి ఈట‌ల విజ‌యం సాధించ‌డం తో ఇప్పుడు ఆ పార్టీ లోనూ కొత్త ఉత్సాహం నెల‌ కొంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌ లో అధికారం చేప‌ట్టడ‌మే ల‌క్ష్యం గా అడుగులు వేస్తున్న ఆ పార్టీ.. ఇప్పుడు టీఆర్ఎస్‌ లోని కొంత‌ మంది ఎమ్మెల్యేల‌ పై ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఓట‌మి తో తీవ్ర షాక్‌ లో మునిగి పోయిన కేసీఆర్‌ కు.. ఇప్పుడు బీజేపీ మ‌రో షాక్ ఇచ్చేందు కు సిద్ధ‌మైంది. అయిదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ లో చేరేందుకు సిద్ధం గా ఉన్నారని ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశార‌నే వార్త‌లు ఇప్పుడు గులాబి బాస్‌ కు గుబులు పుట్టిస్తున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. భూక‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం తో టీఆర్ఎస్‌ ను వ‌దిలి ఎమ్మెల్యే ప‌ద‌వి కి రాజీనామా చేసిన ఈట‌ల‌.. బీజేపీలో చేరి ఉప ఎన్నిక‌లో గెలిచారు. దీంతో త‌న‌కు ఏ పార్టీలో ఉన్నా ప్ర‌జ‌ల అభిమానం ఉంటుంద‌ని చాటారు. ఇప్పుడు ఈట‌ల విజ‌యం తో ధైర్యం తెచ్చుకుంటున్న కొంత‌ మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము కూడా పార్టీ వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

క‌నీసం అయిదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ లో చేరేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. వీళ్లు చాలా కాలం నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఫ‌రి పై అసంతృప్తి తో ఉన్నార‌ని అందుకే పార్టీ లో అంటీ ముట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలిసింది. ఇప్పుడు కేసీఆర్‌ ను ఎదురించి బ‌య‌ట‌కు వ‌చ్చిన గెలిచిన ఈట‌ల దారి లోనే వీళ్లు సాగి బీజేపీ లో చేరాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌జ‌ల్లో కేసీఆర్‌ పై వ్య‌తిరేకత పెరుగుతుంద‌ని భావిస్తున్న ఆ ఎమ్మెల్యేలు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌ పై అది ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని అందుకే పార్టీ మారాల‌నే ఆలోచిస్తున్నార‌ని టాక్‌. గ‌తం లో ఈట‌ల టీఆర్ఎస్‌ లో ఉన్నప్పుడు ఆయ‌న‌తో స‌న్నిహితం గా మెలిగిన నాయ‌కులు.. ఇప్పుడు బీజేపీ లో చేరాల‌ని చూస్తున్నార‌ని తెలిసింది.

మ‌రో వైపు బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు కూడా ఇదే మాట చెప్పారు. హుజూరాబాద్‌ లో ఈట‌ల విజ‌యం త‌ర్వాత కొంత‌ మంది ఎమ్మెల్యే లో బీజేపీ లో చేరేందుకు త‌మ‌తో ట‌చ్‌ లోకి వ‌చ్చార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యం లో బీజేపీ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ పై ప్ర‌త్యేక దృష్టి సారించింద‌ని చెప్పుకోవ‌చ్చు. టీఆర్ఎస్ నుంచి ఇలాంటి ఎమ్మెల్యేల‌ ను ఈట‌ల బీజేపీ లోకి తీసుకు రాగ‌లిగితే పార్టీ లో ఆయ‌న ఇమేజ్ మ‌రింత పెరిగే ఆస్కార‌ముంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యం లో టీఆర్ఎస్ కూడా జాగ్ర‌త్త ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. టీఆర్ఎస్‌ ను వీడాల‌నే ఆలోచ‌న‌ల‌తో ఉన్న ఎమ్మెల్యేల‌ పై కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది.