Begin typing your search above and press return to search.
రేవంత్‌రెడ్డికి.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అంతమంది టచ్‌లో ఉన్నారా?
By: Tupaki Desk | 24 April 2021 11:30 AM GMTతెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుడు, టీడీపీ మాజీ నాయకుడు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎంపీ.. రేవంత్‌రెడ్డికి మంచి ఇమేజ్ ఉంది. ముఖ్యంగా ఆయనకు ఫైర్ బ్రాండ్‌గా పెద్ద పేరే ఉంది. ఆయన ఏ పార్టీలో ఉన్నా.. ఇతర పార్టీల్లోనూ ఆయన మంచి పలుకుబడి.. ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన దీనిని క్యాష్ చేసుకునేందుకు చూస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో రెండు ఆప్షన్లు ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం పోలింగ్ జరిగిన సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జానా రెడ్డి పోటీ చేసినా.. ఓడిపోయే పరిస్థితి ఉందని అంటున్నారు.
ఈ క్రమంలో రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. జానా సీఎం అయ్యే పరిస్థితి లేదు. సో.. అప్పుడు మరో ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, రేవంత్‌రెడ్డి కి మధ్య పీసీసీ అధ్యక్ష పీఠంపై పోటీ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఈ క్రమంలో సీనియర్లు కోమటిరెడ్డికి అధ్యక్ష పగ్గాలు ఇవ్వాలని అంటారు. ఇక, నాయకుడిగా కోమటిరెడ్డి ప్రభావం ఎంత అని చూస్తే.. ఆయన కేవలం నల్లగొండ జిల్లా రాజకీయాలకే పరిమితం అయ్యారని చెప్పొచ్చు. అక్కడ మాత్రమే ఆయన ప్రభావం , పలుకుబడి కొంత మేరకు కనిపిస్తోంది.
అదే రేవంత్‌రెడ్డిని తీసుకుంటే.. తెలంగాణలో యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఈయనకు ఉంది. ఆ జిల్లా ఈ జిల్లా అని కాకుండా ప్రతిజిల్లాలోనూ యూత్ ఫాలోయింగ్ రేవంత్‌కు ఎక్కువగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి దాదాపు 2 కోట్ల మంది యువత ఓటు హక్కు పొందుతారు. సో.. వీరంతా రేవంత్‌కు అండగా నిలుస్తారు. ఇది పరోక్షంగా కాంగ్రెస్‌కు ఒక శక్తిగా మారుతుందని అంటున్నారు. మరో ప్లస్ పాయింట్ ఏంటంటే.. టీఆర్ ఎస్, బీజేపీ లు రెండు ఒకే పార్టీ అని ప్రచారం చేసే ధైర్యం.. రేవంత్ రెడ్డికే ఉంది. దాదాపు ఇప్పటికే ఆయన ఈ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. సో.. ఇది కూడా కాంగ్రెస్‌కు పనిచేస్తుంది.
అయితే.. రేవంత్ కాంగ్రెస్‌లో చాలా జూనియర్ అని, ఆయనకు వద్దు అని కురువృద్ధ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కానీ, మరోవైపు.. కాంగ్రెస్ జాతీయ నేతలు.. రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీలు ఇద్దరూ కూడా రేవంత్ వైపు మొగ్గు చూపుతున్నారని.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా గుడ్డిగా వ్యతిరేకిస్తే.. మొత్తానికే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రేవంత్ కనుక రేపు సొంతగా పార్టీ పెట్టుకుని.. పాదయాత్ర చేస్తే.. దాదాపు మాజీ ఎమ్మెల్యేలు అంతా .. అతని వెంట వెళ్తే.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దాదాపు ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పరిస్థితిని ఎదుర్కొనడం ఖాయమని అంటున్నారు.
ఇక, ఈ మొత్తం ఎపిసోడ్‌లో చాలా ఇంట్రస్టింగ్ టాపిక్ ఏంటంటే.. వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ ఎస్‌కు పనిచేసేందుకు ఎన్నికల వ్యూహకర్త.. ప్రశాంత్ కిశోర్(పీకే) టీం.. రంగంలోకి దిగుతుందని తెలుస్తోంది. ఈ టీం.. కేవలం పని ఆధారంగా నేతలను నిర్ణయిస్తుంది. ఇదే జరిగితే.. చాలా మంది ఎమ్మెల్యేల్లో.. అసంతృప్తి పెరుగుతుంది. వారికి సీట్లు ఇవ్వరు. ఈ నేపథ్యంలోనే వారంతా ఇప్పుడు ముందుగానే కళ్లు తెరిచి.. రేవంత్‌కు టచ్‌లోకి వచ్చారని.. ఇది రేవంత్‌కు పెద్ద అస్సెట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది.
ఇలా వచ్చేవారు ఎలాగూ.. డబ్బులు సంపాయించరు కాబట్టి, మచ్చ లేదు కనుక.. వీరితో టీఆర్ ఎస్‌పై యుద్ధం చేయొచ్చని.. కొందరు నేతలు రేవంత్‌కు సలహాలు ఇస్తున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఈ విషయం బీజేపీలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది. దీంతో ఈ పార్టీ పరిస్థితి కూడా కాంగ్రెస్ మాదిరిగా తయారవుతుందని అంటున్నారు. అంటే.. రెండుగా చీలుతుందని భావిస్తున్నారు. సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ మాదిరిగా తయారవుతుందని.. అంటున్నారు. సాగర్ ఎన్నికల రిజర్ట్ తర్వాత.. తెలంగాణ పెద్ద ఎత్తున రాజకీయంగా పెను మార్పులు ఉంటాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.