Begin typing your search above and press return to search.
నెలలోపల టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం.. రెండో ఆడియోలో సంచలన నిజాలు
By: Tupaki Desk | 28 Oct 2022 1:09 PM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ లో గంటకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ఆడియో క్లిప్స్ కలకలం రేపుతున్నాయి. ఆడియోలకు సంబంధించి రెండు విభాగాలుగా విడుదలయ్యాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ మధ్యవర్తి మాట్లాడిన రెండో ఆడియో తాజాగా లీక్ అయ్యింది.
ఈ రెండో ఆడియోలో రామచంద్రభారతి, సింహయాజీ అనే స్వామీజీలతో నందకుమార్ ఈ ఆడియోలో మాట్లాడినట్టు తెలుస్తోంది. నెలరోజుల్లో టీఆర్ఎస్ సర్కార్ ను కూల్చడమే లక్ష్యంగా ఈ ఆడియోలో ఏజెంట్ లు స్వయంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో మాట్లాడారు.
ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి, బీజేపీ ఏజెంట్ రామచంద్రభారతికి మధ్యసంభాషణలతో మొదటి ఆడియో లీక్ కాగా.. ఇప్పుడు రామచంద్రభారతి , నందకుమార్, సింహయాజీల సంభాషణలతో రెండో ఆడియో లీక్ అయ్యింది. ఈ 27 నిమిషాల ఆడియో తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
రాష్ట్ర బీజేపీకి సంబంధం లేకుండా కేంద్రమే అన్నీ చూసుకుంటుంది. నాకు వాళ్లను వాట్సాప్ కాల్ కాన్ఫరెన్స్ లో కలపండి.. నాది మరో వాట్సాప్ నంబర్ ఇస్తానని.. దానికి కాల్ చేయండి.. బండిసంజయ్,కిషన్ రెడ్డిలకు అంత ప్రాధాన్యం లేదు. గుజరాత్ ఎన్నికల ముందు మునుగోడు కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నాం.. ఒక్కసారి ఎంట్రీ అయితే అమిత్ షాయే అన్నీ చూసుకుంటారని ఆ ఆడియోలో చెప్పడం సంచలనంగా మారింది.
మునుడోగు ముందే మన ఆపరేషన్ చేస్తే చాలా ప్రభావం ఉంటుందని.. బీఎల్ సంతోష్ అని చూసుకుంటారని.. మినిస్టర్ ను కలవాలన్నా అపాయింట్ మెంట్ తీసుకోవాల్సిందేనని రామచంద్రభారతి ఆ ఆడియోలో ఎమ్మెల్యే రోహిత్ తో మాట్లాడారు. రోహిత్ రెడ్డి రాజీనామా చేసిన నెలలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలను టచ్ చేద్దాం అని 26వ తేదీన నేను హైదరాబాద్ వస్తానని.. బీఎల్ సంతోష్, తుషార్ ను కూడా తీసుకొస్తానని రామచంద్రభారతి సంచలన విషయాలను ఆడియోలో చెప్పుకొచ్చాడు.
కేంద్రప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుందని.. మన ఆపరేషన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పడిపోవడం ఖాయమంటూ చెప్పుకొచ్చాడు. మనం కూర్చుంటే కేంద్రం ఏం చేయడానికైనా సిద్ధమంటూ ఆడియోలో భరోసారి కల్పించారు.100 కోట్లు ఇవ్వడానికైనా సిద్ధమని.. మునుగోడు ముందు పార్టీ మారాలంటూ ఆడియోలో కోరారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు వస్తే ఎంత ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.