Begin typing your search above and press return to search.
అంతా సైలెంట్.. భయం భయంగా మంత్రులు..!
By: Tupaki Desk | 28 July 2019 7:58 AM GMTమంత్రులు.. ఎప్పుడూ తమతమ శాఖలపై సమీక్షలు - అభివృద్ధి పనులు - రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు.. ఇలా నిత్యం క్షణం తీరిక లేకుండా.. బిజీబిజీగా గడుపుతుంటారు. కానీ.. తెలంగాణ మంత్రుల పరిస్థితి వేరు. ఎప్పుడూ సైలెంట్ మోడ్‌లోనే ఉంటున్నారు. సంబంధిత శాఖ అధికారులతో సమీక్షలు లేవు. సమావేశాలు లేవు.. అంతా సైలెంట్..! ఎవరి నియోజకవర్గాలకు వారు పరిమితం అయిపోయారు. ఎక్కడి వారు అక్కడే గప్ చుప్ గా ఉంటున్నారు. కేవలం సీఎం కేసీఆర్ చెప్పిన పని చేస్తూ.. తమతమ నియోజకవర్గాల్లో ఏవైనా చిన్నచిన్న పనులు చేస్తూ.. పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ మౌనంగా ఉండిపోతున్నారు.
నిజానికి..డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ తిరుగులేని విజయం సాధించింది. సుమారు రెండు నెలల తర్వాత గానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. అందులో మాజీ మంత్రి హరీశ్ రావు - కేటీఆర్ లకు చోటు కల్పించకుండా అందరికీ షాక్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో.. ఏం చేస్తే మరేం అవుతుందోననే ఆందోళనతో మంత్రులు ఉండిపోతున్నారు. ఒకరిద్దరు మంత్రులు తప్ప మిగతా మంత్రులందరూ తమతమ నియోజకవర్గాలకే పరిమితం అయిపోయారు. ఇక్కడ మంత్రుల పరిస్థితిని చెప్పడానికి ఒకేఒక్క ఉదాహరణ సరిపోతుంది.
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అవకతవకలు జరిగినప్పుడు.. ప్రజల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కానీ.. సంబంధిత శామ మంత్రి జగదీశ్ రెడ్డి నోరుపెదపలేదు. కనీసం మాట్లాడేందుకు కూడా ప్రయత్నం చేయలేదు. నియోజకవర్గానికే పరిమితమైపోయారు. ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది. సాగు పనులు చురుగ్గా సాగుతున్నాయి. కానీ.. ఆ శాఖ మంత్రి కూడా సైలెంట్ గా ఉండిపోతున్నారు. ఇక మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ గ్రేటర్ హైదరాబాద్ లో వ్యవహారాలు చక్కపెట్టుకోవడంతోనే కాలం గడిపేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు మాత్రం కొంత హడావుడి చేస్తున్నారు. అదికూడా ఆయా పరిధుల్లోనే కావడం గమనార్హం. అలాగే మంత్రి ఈటల రాజేందర్ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. అసలు ఆర్థికమంత్రిగా ఆయన స్వీయ నిర్ణయాలపై తెలంగాణ ప్రజలందరికి అనుమానాలు ఉన్నాయ్. మంత్రులు మల్లారెడ్డి - మహమూద్ అలీ - శ్రీనివాస్ గౌడ్ తదితర మంత్రులు ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
గత కేబినెట్ లో తుమ్మల లాంటి వాళ్లు నేరుగా కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో అపాయింట్ మెంట్ లేకుండానే వెళ్లిపోయేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఒక్కరంటే ఒక్కరికి కూడా లేదు. కొందరికి అపాయింట్ మెంటే లేని పరిస్థితి అని కూడా టాక్ ఉంది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. మరికొద్ది రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ పదవులకు ఎసరు పడుతుందనే ఆందోళనతో పలువురు మంత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గ విస్తరణలో హరీశ్ రావుకు కీలక శాఖ అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక.. పనులను వదిలిపెట్టి పదవులపై ధ్యాసతో పలువురు మంత్రులు భయంభయంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.