Begin typing your search above and press return to search.

గులాబీ నేత‌ల మ‌న‌సులో మాట కేసీఆర్ వింటారా...!

By:  Tupaki Desk   |   16 Dec 2019 2:30 PM GMT
గులాబీ నేత‌ల మ‌న‌సులో మాట కేసీఆర్ వింటారా...!
X
ఉద్య‌మాల పురిటిగ‌డ్డ‌గా...కాక‌తీయ సామ్రాజ్య‌పు రాజ‌ధానిగా పేరొందిన ఓరుగ‌ల్లులో ఎప్పుడు రాజ‌కీయం రంజుగానే ఉంటుంది. అధికార ప‌క్షం...ప్రతిప‌క్షంలో నేత‌లు ఢీ అంటే ఢీ అనేవారు. అయితే కేసీఆర్ మ్యాజిక్‌తో ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షాల అడ్ర‌స్ గ‌ల్లంత‌యైంది. కేసీఆర్ చ‌రిష్మా ముందు ఎవ‌రెన్ని జిమ్మిక్కులు చేసినా కొండా దంప‌తుల వ‌లె చేతులు కాల్చుకోక త‌ప్ప‌ద‌ని భ‌య‌ప‌డ్డారు.. ప‌డుతున్నారు కూడా. వ‌రంగ‌ల్ రాజ‌కీయ వేదిక‌పై నిర‌స‌న గ‌ళం వినిపించే నాయ‌కులే క‌న‌బ‌డ‌టం లేదు. ఆ గొంతును ఎవ‌రో స‌వ‌రించుకున్నా... జ‌నాల చెవుల‌కు చేర‌డం లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే అన్ని పార్టీల నేత‌లు ఎన్నిక‌ల‌కు ముందు... టికెట్లు ఆశించి కొంద‌రు.. నామినేటెడ్ ప‌దవులైనా వ‌స్తాయ‌ని మ‌రికొంద‌రు గులాబీ గూటికి చేరుకున్నారు. ఇందులో కొంద‌రికి కేసీఆర్ ఆశీర్వాదం ల‌భించినా... మ‌రికొంద‌రికి మాత్రం టీఆర్ఎస్ కండువా మాత్ర‌మే పార్టీ సింబ‌ల్ మారింది. వ‌రంగ‌ల్‌లో అధికార పార్టీ నిండుకుండ‌లా మారింది. అయితే ఇలాంటి ప‌రిస్థితుల్లో స్వ‌ప‌క్షంలోనే విప‌క్షం త‌యారైంద‌ని స‌మాచారం. అంద‌రూ సీనియ‌ర్ నేత‌లే కావ‌డంతో మంత్రి ప‌ద‌విపై ఆశ ప‌డుతున్నార‌ట‌. కేసీఆర్ మాత్రం ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌ రావుకు - ఎమ్మెల్సీ స‌త్య‌వ‌తికి మాత్ర‌మే మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు.

వాస్త‌వానికి వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ‌ ఎమ్మెల్యే విన‌య్‌ భాస్క‌ర్‌ కు - వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ - డోర్న‌క‌ల్ ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్‌ - ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి మంత్రి ప‌ద‌వులు ఆశించారు. వీరిలో ఒక్కోరు ఒక్కో విధంగా త‌మ‌కు మంత్రి ప‌ద‌వులు వ‌స్తాయ‌ని స‌న్నిహితుల వ‌ద్ద గ‌తంలో చెప్పుకున్నార‌ట‌. వ‌ర్థ‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేష్ భారీ మెజార్టీతో గెల‌వ‌డం ఎస్సీ సామాజిక వ‌ర్గంలో ఉండ‌టంతో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశించారు. ప‌ర‌కాల ఎమ్మెల్యే ధ‌ర్మారెడ్డి కొండా సురేఖ‌పై గెల‌వ‌డంతో పాటు రెండోసారి ఎమ్మెల్యే కావ‌డం చేత ఆయ‌న మంత్రి ప‌ద‌విపై ఆశ‌ప‌డ్డార‌ట‌.

ఎమ్మెల్యే విన‌య్‌ భాస్క‌ర్ పార్టీ వ్య‌వ‌స్థాపితం అయిన నాటి నుంచి ప‌నిచేస్తున్నారు. వరుస‌గా నాలుగోసారి విజ‌యం సాధించారు. దీంతో సీనియ‌ర్‌ గా ఉద్య‌మ‌నేత‌గా మంత్రి ప‌ద‌వి ఆశించారు. రెడ్యానాయ‌క్ గ‌తంలో కాంగ్రెస్‌లో మంత్రిగా కొన‌సాగారు. సీనియ‌ర్‌గా ఉన్న త‌న‌కు త‌ప్ప‌కుండా మంత్రి ప‌ద‌వి వస్తుంద‌ని ఆశించార‌ట‌. కానీ కేసీఆర్ సామాజిక కోణంలో.. జిల్లాల వారీగా చేసిన స‌ర్దుబాటులో వీరు గ‌ల్లంత‌య్యారు. అయితే కరీంన‌గ‌ర్ నుంచే ఐదుగురు మంత్రులు ఉండ‌టాన్ని వారు కేటీఆర్‌ కు గుర్తు చేసిన‌ట్లు స‌మాచారం. ఆ లెక్క‌న త‌మ‌కు మంత్రి ప‌ద‌వి కావాల‌ని ఐదుగురు నేత‌లు అధిష్ఠానం వ‌ద్ద అర్జీ పెట్టుకున్న‌ట్లు స‌మాచారం. చూడాలి మ‌రి మంత్రి వ‌ర్గ మార్పు ఉంటుంద‌ని వినిపిస్తున్న నేప‌థ్యంలో వీరికి అవ‌కాశం ల‌భిస్తోందో లేదో మ‌రి..