Begin typing your search above and press return to search.
ఇదేనా జర్నలిజం? ఆంధ్రజ్యోతి ఆర్కే.. కవిత మధ్య మాటలు చదవాల్సిందే
By: Tupaki Desk | 28 Aug 2022 10:34 AM GMTఇద్దరూ ఇద్దరే. ఒకరు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థకు అధినేతగా వ్యవహరించిన వేమూరి రాధాక్రిష్ణ అయితే.. మరొకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల తనయ కవిత. ఇద్దరిలోనూ కామన్ పాయింట్.. జీవితం ఆరంభంలో అతి సామాన్యంగా మొదలై.. కోట్లాది మందిని ప్రభావితం చేయటం. తెలంగాణ ఉద్యమంలో జాగ్రతి సంస్థ ద్వారా కవిత చేసిన పోరును తక్కువగా చెప్పలేం. బతుకమ్మ పేరుతో.. తెలంగాణ మహిళల్ని ఏకం చేయటంలో ఆమె కీలకభూమిక పోషించారు.
సహజంగానే మంచి మాటకారి అయిన కవిత.. తన ఆక్రోశాన్ని.. ఆవేదనను వ్యక్తం చేసే విషయంలో ఏ మాత్రం తగ్గని రీతిలో వ్యవహరించటం ఒక ఎత్తు అయితే.. తనను బుల్ డోజ్ చేయటాన్ని ఏ మాత్రం ఇష్టపడని మీడియా అధినేతగా ఆర్కే అందరికి సుపరిచితులు. చిన్నతనం నుంచి అంకుల్.. అంకుల్ అంటూ ఆర్కేను అనేసే కవిత.. తన మీద ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తలపై లైవ్ ఇంటర్వ్యూలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు.. దానికి ఆర్కే రియాక్టు అయిన విధానం ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి.
ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు సంబంధాలు ఉన్నాయంటూ ఢిల్లీ బీజేపీ నేతలు ఆరోపించటం.. దీనిపై తెలంగాణ అధికారపక్షం ఆగ్రహం వ్యక్తం చేయటం.. తన తండ్రిని టార్గెట్ చేసిన మోడీ.. కావాలనే తన మీద బురద జల్లే ప్రోగ్రాం చేపట్టారన్న వాదనను వినిపిస్తున్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన మీద ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తపై ఒకింత ఆగ్రహం.. ఒకింత ఆవేదనతో.. 'అంకుల్.. ఇదేం జర్నలిజం?' అంటూ చేసిన వ్యాఖ్య సందర్భంగా ఈ ఇద్దరు ప్రముఖల మధ్య జరిగిన సంభాషణను మిస్ కాకుండా చదవాల్సిందే.
ఎవరికి ఎవరు తగ్గనట్లుగా ఉండే ఈ ఎపిసోడ్ లో కవిత్ కాసింత వెనుకబడినట్లుగా కనిపిస్తారు. అయితే.. ఆర్కేను ఉద్దేశించి కొన్ని మాటలు అనేందుకు జంకే చాలామంది నేతలకు భిన్నంగా ఆమె.. తాను అనాల్సిన మాటల్ని అనేసింది. అయితే.. ఆమెను కంట్రోల్ చేసే విషయంలో ఆర్కే పైచేయి సాధించారనే చెప్పాలి. బిగ్ డిబేట్ పేరుతో నిర్వహించిన లైవ్ లో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆద్యంతం ఆసక్తికరమని చెప్పొచ్చు. అసలేం జరిగిందన్నది చూస్తే..
ఢిల్లీ బీజేపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను 'ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత హస్తం' పేరిట 'ఆంధ్రజ్యోతి' ప్రచురించడాన్ని ఎమ్మెల్సీ కవిత తప్పుబట్టారు. ''అసలు లిక్కర్ స్కాం అయిందా లేదా తెల్వదు. దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. కానీ, మీ పేపర్లో మాత్రం లిక్కర్ స్కాంలో కవిత హస్తం అని రాశారు. అటువంటి వార్త వేసే ముందు నువ్వు ఏమంటావని నాకు ఫోన్ చేస్తే నా రిజాయిండర్ ఇచ్చేదానిని'' అని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా, కేసీఆర్ తనను మందలించారని కూడా రాశారని కవిత వ్యాఖ్యానించారు.
దీనికి స్పందించిన ఆర్కే.. ''మేం ప్రచురించిన వార్త నిరాధారమని అంటే అంగీకరించను. ఢిల్లీలో ఏం జరిగిందన్న అంశంపై నాకు స్పష్టమైన సమాచారం ఉంది'' అని వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కాంలో మీ బంధువులు ఉండడంతో బీజేపీ మిమ్మల్ని ఇరికిస్తోంది కదా అని ప్రశ్నించేందుకు వెనుకాడలేదు. దీంతో.. కవిత కాస్త ఇబ్బందికి గురయ్యారు. అయినప్పటికీ దాన్ని కవర్ చేస్తూనే.. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటో చూపించండి అనటం.. సమయం వచ్చినప్పుడు చూపిస్తామని అంతే ధీటుగా చెప్పటం కనిపిస్తోంది.
ఇక.. ఆంధ్రజ్యోతిలో పబ్లిక్ అయిన 'కేసీఆర్ కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు' అన్నది ఎలా చెబుతారు? ఆమె ప్రశ్నించగా.. తనకు పక్కా సమాచారం అందన్నారు. మా నాన్నతో నేను మాట్లాడింది మీకు ఎవరు చెబుతారు? మీరు అక్కడ ఉన్నారా? అని కవిత ప్రశ్నించగా.. అక్కడ ముగ్గురు నలుగురు ఉన్నారన్న విషయాన్ని ఆర్కే ప్రస్తావించారు. వారెవరో చెప్పండి అంకుల్.. సీఎంవో నుంచి పీకేద్దామన్న కవిత వ్యాఖ్యలకు స్పందించిన ఆయన.. 'కేసీఆర్ మీతో వాడిన పదాన్ని కూడా చెప్పమంటే చెబుతానని' ఆర్కే వ్యాఖ్యానించారు.
దీంతో.. 'ఆంధ్రజ్యోతి' తనను టార్గెట్ చేసిందని కవిత ఆరోపించగా.. ''మేం కాదు.. మోదీ, షాలే మిమ్మల్ని టార్గెట్ చేశారు'' అని ఆర్కే పేర్కొన్నారు. మోదీ అమిత్ షాలకు తాము టార్గెట్ అయితే, మరి మీరెందుకు తెలంగాణకు వ్యతిరేకంగా రాస్తున్నారని కవిత ప్రశ్నించారు. దాంతో, ''టీఆర్‌ఎస్ వేరు. తెలంగాణ వేరు. టీఆర్‌ఎస్ ఫక్తు రాజకీయ పార్టీ. తెలంగాణ కోసం కేసీఆర్ పోరాడారు. కానీ, దానికి బదులుగా తెలంగాణ మీకు ఇచ్చింది కూడా ఎక్కువే'' అని ఆర్కే బలంగా బదులిచ్చారు.
''టీఆర్‌ఎస్ ను విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్లు కాదు. బీజేపీ నాయకుల ఆరోపణలను ప్రచురించాం. మంత్రులు వచ్చి మీకు సంఘీభావం తెలిపిన వార్తను కూడా వేశాం. మేం రాసింది తప్పని అనిపిస్తే కేసు వేసుకోవచ్చు'' అంటూ కవితతో ఆర్కే అన్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.