Begin typing your search above and press return to search.
నామా టీఆర్ ఎస్ ను జీర్ణించుకోవడం లేదా?
By: Tupaki Desk | 28 March 2019 5:01 AM GMTపాతికేళ్లకు పైగా సహవాసం.. నిన్నగాక మొన్న సీటు మారితే ఆ వాసనలు పోతాయా.? పోవు కదా.. అందుకే ఇప్పుడు ఖమ్మం ఎంపీ సీటును చివరి నిమిషంలో దక్కించుకున్న టీడీపీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు ప్రచారంలో తడబడుతున్నాడు. తాను టీఆర్ ఎస్ లో చేరానన్న వాస్తవాన్ని జీర్ణించుకోకుండా టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని తాను ఇంకా టీడీపీ అభ్యర్థినే అని పొరపడుతున్నాడు.
ఎన్నో ఏళ్ల నుంచి టీడీపీలో ఉండి సైకిల్ గుర్తును బలంగా మదిలోపెట్టుకున్న టీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం ప్రచారంలో నాలుక మడతేస్తున్నాడు. ప్రచారంలో భాగంగా టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. అంతలోనే నాలుక కరుచుకొని తూచ్ టీఆర్ ఎస్ కు ఓటు వేయాలని అంటున్నారు.
ఖమ్మం ఎంపీ సీటును ఈసారి సిట్టింగ్ ఎంపీ పొంగులేటిని కాదని టీడీపీ నుంచి వచ్చిన మాజీ ఎంపీ నామాకు టీఆర్ ఎస్ కట్టబెట్టింది.దీంతో నామా ఖమ్మం నియోజకవర్గం రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. పొరపాటున టీడీపీని గెలిపించాలని.. సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఫ్లోలో చెప్పేస్తున్నారు. అనంతరం తప్పును తెలుసుకొని టీఆర్ ఎస్ కు పట్టం కట్టి కారు గుర్తుపై ఓటేయాలని సభల్లో నాలుక కరుచుకుంటున్నారు.
నామా నాగేశ్వరరావు పార్టీ మార్చినంత సులభంగా.. లోపల దశాబ్ధాలుగా మనసులో గూడుకట్టుకున్న పార్టీ భావజాలాన్ని మాత్రం మార్చుకోలేకపోతున్నారనడానికి ఇదే నిదర్శనం. రాజకీయ అవసరం కోసం టీఆర్ఎస్ లో చేరిన నామా టీఆర్ ఎస్ పార్టీని ఇంకా జీర్ణించుకోలేకపోవడం గమనార్హం.