Begin typing your search above and press return to search.
కేసీఆర్ తో డీఎస్ ఢీ.. దమ్ముంటే చర్య తీసుకో
By: Tupaki Desk | 26 Sep 2019 11:42 AM GMTఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ డీ శ్రీనివాస్. డీ శ్రీనివాస్ బీజేపీలో చేరుతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దానికి బలాన్ని ఇచ్చేలా డీఎస్ వ్యవహరించారు. ఆయన కుమారుడు - బీజేపీ ఎంపీ మాత్రం తన తండ్రి డీఎస్ ను బీజేపీలో చేర్చుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు.
అయితే తాజాగా డీ శ్రీనివాస్ తాను బీజేపీలో చేరబోతున్నారనే టీఆర్ ఎస్ విమర్శలపై స్పందించారు. తాను బీజేపీలో చేరడం లేదని.. టీఆర్ ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. తాను బీజేపీలోకి వెళ్లాలనుకుంటే ధైర్యంగా వెళుతానని చెప్పుకొచ్చారు. ఎవరూ తనను ఆపలేరని స్పష్టం చేశారు.
డీఎస్ తన కుమారుడు అరవింద్ గెలుపు కోసం నిజామాబాద్ లో కవితను ఓడించాడనే విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి గులాబీ బాస్ పార్టీ కార్యక్రమాలకు డీఎస్ ను దూరం పెట్టారు. అయితే టీఆర్ ఎస్ నుంచి రాజ్యసభ టికెట్ పొందిన డీఎస్ బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆ పార్టీలో చేరితే టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యత్వం పోతుందని భావించి అధికారికంగా కండువా కప్పుకోవడం లేదు. తాజాగా అమిత్ షాను కలిసినా బీజేపీలో చేరికపై మాత్రం నోరు మెదపడం లేదు..
డీఎస్ బీజేపీ కండువా కప్పుకుంటే రాజ్యసభ చైర్మన్ కు విషయం చెప్పి అతడిని అనర్హుడిగా ప్రకటిద్దామని కేసీఆర్ యోచిస్తున్నారు. కానీ కేసీఆర్ నే ముప్పుతిప్పలు పెట్టేలా డీఎస్ వ్యవహరిస్తున్నారు. బీజేపీతో సాన్నిహిత్యంగా ఉంటూ ఆ పార్టీలో మాత్రం అధికారికంగా చేరకుండా గులాబీ బాస్ ను విసిగిస్తున్నారు. తాజాగా తాను బీజేపీలో చేరలేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు డీఎస్.