Begin typing your search above and press return to search.
ఎంపీ గుత్తా మరదలు సూసైడ్ వెనుక?
By: Tupaki Desk | 22 Sep 2017 8:05 AM GMTఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరదలు ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారుతోంది. పినతల్లి కొడుకు ఇంట్లో చోటు చేసుకున్న ఈ ఉదంతంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న గుత్తా మరదలు 45 ఏళ్ల శ్రీలతను అమాయకురాలిగా.. ఆమె ఆత్మహత్య ఉదంతానికి ఫీల్ అవుతున్న వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది.
తమకు దగ్గర బంధువు ఎంపీ అయినప్పటికీ ఆమె ఇంటి సమస్యను రచ్చకు పెట్టుకోలేక.. లోలోన కుమిలిపోతూ ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లలోని తమ ఇంట్లో ఆమెచీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు వెల్లడిస్తున్న సమాచారంతో పాటు.. వారి కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వారు అందిస్తున్న సమాచారం చూస్తే.. శ్రీలత ఉదంతం అయ్యో అనిపించక మానదు.
ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పినతల్లి కుమారుడు గుత్తా మహేందర్ రెడ్డి. అతని భార్య శ్రీలత వ్యవసాయ పనులతో పాటు గేదెల్ని సాకుతూ.. ఇంటి బాధ్యతను చూసుకుంటుందని చెబుతారు. అందరికి కలిసిపోయి ఉండటంతో పాటు.. మెతక ధోరణితో ఉంటుందని చెబుతారు. మహేందర్ రెడ్డి - శ్రీలత దంపతులకు ఒక కుమార్తె.. కుమారుడు ఉన్నారు. కుమార్తె ఎంటెక్ చదువుతుండగా.. కొడుకు బీటెక్ చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. గురువారం పాలు పితికి అందరికి ఇచ్చిన ఆమె.. భర్త పొలానికి వెళ్లిన తర్వాత స్టోర్ రూంలో ఉరి వేసుకున్నారు.
ఆమె తనువు చాలించిన చోట సూసైడ్ లేఖ రాసి ఉంది. అందులో.. "ఏ తల్లి అయినా పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. నాలో ఏ తప్పులూ లేవు. కానీ మిమ్మల్ని ఎదిరించి బతికే ధైర్యం నాకు లేదు. నా బాధ్యత ఒక్కటే.. చింటు చదువు. నా కోరిక మేరకు బాగా చదువుకో ఎలాగైనా ఉద్యోగాన్ని సంపాదించు.. చింటూ.. మౌనిక నన్ను క్షమించండి" అంటూ పేర్కొన్నారు.
ఇంతకీ శ్రీలత సూసైడ్ కి కారణాలు ఏమిటన్న విషయానికి వస్తే.. మహేందర్ రెడ్డి ఫ్యామిలీకి.. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫ్యామిలీకి మధ్య భూవివాదం ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ విషయంపై కలత చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతుంటే.. మరోవైపు ఎంపీ గుత్తాకు ఉరుమడ్లలో ఉన్న కోళ్లఫారంలో పని చేయటానికి కేరళ నుంచి ఒక యువతి వచ్చినట్లు తెలిసింది. ఆమెతో మహేందర్‌రెడ్డి చనువుగా ఉండటంతో పాటు చిట్ పాడగా వచ్చిన రూ.6లక్షలు ఖర్చు చేసినట్లుగా తెలిసింది. దీంతో.. ఎవరికి చెప్పలేక మనోవ్యధతో శ్రీలత సూసైడ్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనానికి తెర తీసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం బయటకు రావాల్సి ఉంది.