Begin typing your search above and press return to search.
ఆ గులాబీ ఎంపీ ఐడియా అదిరింది కేసీఆర్
By: Tupaki Desk | 22 Feb 2016 4:13 AM GMTకొంతమంది నేతలు చేసే ప్రయోగాలు అందరికి ఆదర్శంగా మారటమే కాదు.. అధినేతల మనసుల్ని కూడా దోచుకుంటాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర అధికారపక్ష ఎంపీ జితేందర్ రెడ్డి అనుసరిస్తున్న విధానాన్ని రెండు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు అనుసరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తాజాగా ఒక వినూత్నవిధానానికి తెర తీశారు.
తన నియోజకవర్గ ప్రజలకు తాను అందుబాటులో ఉండటానికి వీలుగా ఆయన ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు. ఆ కాల్స్ ను స్వీకరించటానికి.. వాటిని నమోదు చేయటానికి.. ఆ ఇష్యూల మీద దృష్టి సారించటానికి వీలుగా కొంతమంది సిబ్బందిని సిద్ధం చేశారు.
తాను నియోజకవర్గంలో ఉన్నా.. హైదరాబాద్.. ఢిల్లీ ఇలా ఎక్కడున్నా సరే.. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా ఆయనీ ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలు తనకు ఏదైనా చెప్పాలనుకుంటే ఆ విషయాల్నిఈ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తెలియజేయొచ్చని చెబుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటంతో పాటు.. వారి అవసరాలు.. కష్టనష్టాలు తెలుసుకోవటానికి ఈ విధానం ఎంతో సాయం చేస్తుందన్న అభిప్రాయాన్ని జితేందర్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు.
అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకొని చేసే ఇలాంటి ప్రయత్నాలు ఎంతైనా అభినందనీయమే. అయితే.. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు ప్రచారం కోసం కాకుండా.. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కార దిశగా పని చేస్తే ప్రయోజనం ఉంటుంది. అంతేకాదు.. ఇదే విధానాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరిస్తే బాగుంటుందన్న భావన ఉంది. ఇంతకీ జితేందర్ రెడ్డి టోల్ ఫ్రీ నెంబరు ఎంతంటారా? అక్కడికే వస్తున్నాం.. ‘‘8333006060’’. వినేందుకు బాగుందనిపిస్తున్న ఈ గులాబీ ఎంపీ ఐడియా ఎంతవరకు వర్క్ వుట్ అవుతుందో చూడాలి.