Begin typing your search above and press return to search.
మోడీ పరివారానికి దిమ్మ తిరిగేలా ‘కేకే’ పంచ్
By: Tupaki Desk | 8 Dec 2016 4:47 AM GMTసుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కె.కేశవరావు కేకేగా సుపరిచితులు. తెలంగాణ కాంగ్రెస్ నేతగా.. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా కేసీఆర్ తో చేతులు కలిపి.. ఆయన పార్టీలో చేరిపోవటం తెలిసిందే. సరైన సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు వెళ్లటంలో కేకే సక్సెస్ అయ్యారని చెబుతారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తన నోటి మాటలతో తరచూ వార్తల్లో ఉండే ఆయన.. టీఆర్ఎస్ లో చేరిన తర్వాత నుంచి ఆచితూచి మాట్లాడుతున్నారు.
తొందరపడి ఆయన నోటి నుంచి ఎలాంటి మాటలు రావటం లేదు. నిజానికి ఆయన మాటలు కాస్తంత సిత్రంగా ఉంటాయి. సంబంధం లేని విషయాల్ని కలేసి.. తిరగమాత పెట్టేసినట్లుగా ఉండే ఆయన మాటలు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటాయి. విషయాల మీద పట్టు ఉన్న ఆయన.. తాజాగా నోట్ల రద్దు అంశంపై రాజ్యసభలో విపక్షాల ఆందోళనల సందర్భంగా ఆయన చేసిన ఒక వ్యాఖ్య అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పార్లమెంటు సమావేశాలకు పెద్దగా హాజరు కాని ప్రధాని మోడీ తీరును ప్రశ్నించిన కేకే.. వేలెత్తి చూపించటానికి వీల్లేని ఒక పాయింట్ ను తెర మీదకు తీసుకొచ్చారు.
గడిచిన కొద్దిరోజులుగా విపక్షసభ్యులు మోడీని సభకు రావాలంటూ పట్టుబడుతున్నారు. ఈ విషయం మీద మాట్లాడిన కేకే.. తన వాక్ చాతుర్యంతో విపక్ష సభ్యుల్ని విపరీతంగా ఆకర్షించారు. ‘‘ప్రస్తుతం జరిగేది నోట్ల రద్దుపై చర్చ కాదు. నోట్ల రద్దు అనంతర పరిస్థితిపై చర్చ. ఈ చర్చలో 14 మంది మంత్రులు సమాధానం ఇవ్వాలి. అందుకే మంత్రులందరిని సమన్వయం చేసుకొని ప్రధాని ఒక్కరే వివరణ ఇవ్వాలి. అందుకే ఆయన సభకు రావాలి’’ అంటూ చెప్పిన వైనం విపక్ష సభ్యులకు విపరీతంగా నచ్చేసింది. దీంతో.. కేకే చెప్పిన మాటకు.. విపక్ష సభ్యులంతా బల్లలు చరచి.. తమ ఆనందాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.