Begin typing your search above and press return to search.

క్యాస్టింగ్ కౌచ్‌...క‌విత‌కు ఏం జ‌రిగిందంటే...

By:  Tupaki Desk   |   22 May 2018 3:47 PM GMT
క్యాస్టింగ్ కౌచ్‌...క‌విత‌కు ఏం జ‌రిగిందంటే...
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుటుంబానికి ఉన్న బ‌లం..అంశం ఏదైనా స‌మ‌ర్థంగా త‌మ వాద‌న‌ను వినిపించ‌డం. సంద‌ర్భోచితంగా ఇత‌రులకు కౌంట‌ర్ వేయ‌డం - త‌మ ఆలోచ‌న‌ల‌కు త‌గిన బేస్‌ ను ఏర్పాటుచేసుకోవ‌డం గులాబీ ద‌ళ‌ప‌తి కుటుంబానికి ఉద్య‌మంతో పెట్టిన విద్య‌!. తాజాగా కేసీఆర్ త‌న‌య‌, నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత అలాంటి వ్యాఖ్య‌లే చేశారు. ఢిల్లీలో ఎంపీ క‌విత అనేక అంశాల‌ను పంచుకున్నారు. 17వేల కోట్ల రుణాలు మాఫీ చేసినా రైతులు మళ్లీ అప్పులు పాలవుతున్నారని ఇది బాధాక‌ర‌మ‌ని అన్నారు. రైతు ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్నాయని, ఈ కష్టాల నుంచి రైతులను గట్టెక్కించేందుకు రైతుబంధు పధకం తెచ్చామ‌న్నారు. రైతులు వడ్డీ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకే రైతుబంధు ప‌థ‌క‌మ‌న్నారు.

దక్షిణ-ఉత్తర రాష్ట్రాలు అనే భేదాలు ‌వద్దు...అందరం‌ భారతీయులమ‌ని ఎంపీ క‌విత ఈ సంద‌ర్భంగా క‌విత అన్నారు. ఫలితాలిచ్చే రాష్ట్రాలను - ఫలితాలు చూపని రాష్ట్రాల ను ఒక‌ గాటన‌ కట్టొద్దని కేంద్ర ప్ర‌భుత్వానికి ప‌రోక్షంగా క‌విత సూచించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేస్తున్న జాతీయ రాజ‌కీయాల ఎత్తుగ‌డ‌ను క‌విత వివ‌రించారు. ఫెడరల్ ఫ్రంట్ గేమ్ చేంజర్ అని వివ‌రించారు. త‌మ ఫ్రంట్ ఏర్పాటు ప్రకియ కొనసాగుతోందని ఆమె స్ప‌ష్టం చేశారు.``మా‌ఎజెండా నచ్చి వచ్చేవారందరికీ స్వాగతం. బీజేపీకి మేము సన్నిహితంగా లేము. మోడీ ప్రభుత్వం తో వర్కింగ్ రిలేషన్స్ మాత్రమే ఉన్నాయి`` అని క‌విత అన్నారు. త‌మది బలమైన పార్టీ అని అందుకే బీజేపీ ఏజెంట్, కాంగ్రెస్ ఏజెంట్ అని దుష్ప్రచారం చేస్తున్నాయని క‌విత అన్నారు. ప్రభుత్వాల‌ మార్పిడి కాదు, వ్యవస్థలో మార్పు కావాలని క‌విత కోరారు. `దేశాన్ని మార్చే అవకాశాన్ని మోడీ జారవిడుచుకున్నారు. ఈ ఏడాదిలో నైనా రైతులకు మేలు చేస్తారేమో చూడాలి. రాష్ట్రాలను పరిగణలోకి తీసుకోకుండా పాలసీలు రూపొందించడం సరైంది కాదు` అని క‌విత అన్నారు. కాస్టింగ్ కౌచ్ పై అడిగిన ప్రశ్నపై ఎంపీ కవిత స్పందిస్తూ త‌న‌దైన శైలిలో రియాక్ట‌య్యారు. కాస్టింగ్ కౌచ్‌పై కాంగ్రెస్ నాయ‌కురాలు, ఎంపీ రేణుకా చౌదరీ మాటలకు మద్దతిస్తారా అన్న ప్రశ్నకు ``నేనెప్పుడు అలాంటి ఘటనలు ఎదుర్కొలేదు` అని ఎంపీ కవిత వివ‌రించారు.