Begin typing your search above and press return to search.
కవితను ఇంప్రెస్ చేసిన ఫొటో ఏదంటే?
By: Tupaki Desk | 19 April 2017 4:20 AM GMTనిజమే... తెలంగాణలో అధికార పార్టీ ఎంపీగానే కాకుండా - తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించేలా ఉద్యమం కొనసాగించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె హోదాలో కల్వకుంట్ల కవిత కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికే పోషించారు. తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ పండుగకు ఒక్క తెలంగాణలోనే కాకుండా విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడంలో సక్సెస్ సాధించిన తెలంగాణ జాగృతి సంస్థకు అధ్యక్షురాలిగా కూడా కవిత పెద్ద ఎత్తున జనామోదాన్నిపొందారు.
ఇదంతా గతమైనప్పటికీ... ఇప్పుడు నిజామాబాద్ ఎంపీగానే కాకుండా... టీఆర్ ఎస్ యువనేత కేటీఆర్ సోదరిగా తెరపైకి వచ్చేసిన కవిత... అన్నకు తగ్గ చెల్లిగానే రాణిస్తున్నారు. అన్న ఐస్ క్రీము అమ్మితే... తాను చీరలమ్మేసి అన్న సంపాదించినంత మేర ఆదాయాన్ని కూడగట్టి పార్టీ సభకు తనవంతు సహకారాన్ని అందించారు. ఈ క్రమంలోనే నిన్న జగిత్యాల్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ... ఏ ఒక్క కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించని కవిత... అటుగా వెళుతుండగా తన కంటబడిన ఓ దృశ్యాన్ని ఏకంగా తన ట్టిట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి మరీ... తనను అమితంగా ఆకట్టుకున్న ఫొటో ఇదేనంమూ ఆమె ఓ ఆసక్తికర కామెంట్ చేశారు.
ఆ ఫొటో అసలు విషయంలోకి వెళితే... కవిత జగిత్యాల్ పర్యటనలో భాగంగా కారులో వెళుతుండగా... రోడ్డుకు ఓ పక్కగా... ఓ ఎనిమిదేళ్ల బాలుడు తన సైకిల్ కు టీఆర్ ఎస్ జెండా కట్టుకుని వెళుతున్న వాడల్లే కవిత కాన్వాయ్ ని చూసి ఆగిపోయాడు. సైకిల్ పై నుంచి దిగకుండానే సైకిల్ పై అటో కాలు - ఇటో కాలు వేసుకుని కవిత కాన్వాయ్ వైపు ఆసక్తిగా చూస్తు నిలబడ్డాడు. ఈ సన్నివేశాన్ని గమనించిన కవిత... సదరు బాలుడి ఫొటోను తన సెల్ ఫోన్ ద్వారా క్లిక్ మనిపించారు. తన పర్యటన ముగిశాక అదే ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి... ఈ రోజు నన్ను అమితంగా ఆకట్టుకున్న ఫొటో ఇదేనని, దానికి జై తెలంగాణ నినాదాన్ని జోడిస్తూ కామెంట్ పోస్ట్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/