Begin typing your search above and press return to search.
జనాల మూడ్ చెప్పిన కవితక్క!
By: Tupaki Desk | 19 Jun 2017 4:49 PM GMTకోటి ఆశలు పెట్టుకొన్న వంద కోట్ల భారతీయులకు భారీ షాకిచ్చింది టీమిండియా క్రికెట్ జట్టు. ఆత్మవిశ్వాసం పరాకాష్ఠకు వెళ్లిపోవటంతో.. ఏముందిలే పాక్ జట్టే కదా? అన్నట్లుగా ఆడినందుకు దిమ్మ తిరిగే షాకిచ్చి కప్పు పట్టుకొని వెళ్లిపోయింది పాక్ జట్టు. ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాది చేతిలో దారుణంగా దెబ్బ తిన్న నేపథ్యంలో టీమిండియాకు సపోర్ట్ గా నిలిచిన ప్రముఖులు కొందరైతే.. చావు తిట్లు తిట్టేసి.. శాపనార్థాలు పెట్టేసిన ప్రముఖులూ ఉన్నారు.
ఈ ఇద్దరికి భిన్నంగా వ్యంగ్యస్త్రాలతో కామెడీ కామెడీ చేసుకున్నారు మరికొందరు. ఈ మూడో కోవకు వస్తారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ నిజామాబాద్ ఎంపీ కవితక్క. టీమిండియా దారుణ ఓటమిపై అందరి కంటే ముందుగా రియాక్ట్ అయ్యింది సోషల్ మీడియానే. భారత జట్టు దారుణ ఓటమిపై భారీ ఎత్తున వ్యంగ్యస్త్రాల్ని సంధించారు నెటిజన్లు.
క్రియేటివితో వారు తయారు చేసిన వ్యంగ్యస్త్రాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అలా మారిన ఒక కార్టూన్ ను తాజాగా షేర్ చేశారు కవితక్క. ప్రస్తుతం జనాల మూడ్ ఇలా ఉందంటూ క్యాప్షన్ పెట్టి మరీ పోస్ట్ చేసిన పోస్ట్ ను చూస్తే.. క్రికెట్ బ్యాట్ ను హాకీ స్టిక్ గా మలిచి హాకీ ఆడేందుకు వెళుతున్నట్లుగా ఉన్న దృశ్యం ఈ కార్టూన్ లో ఉంది. ఎన్ని క్రీడలు ఉన్నా జాతీయ క్రీడ హాకీ తర్వాతే అన్న అర్థం వచ్చేలా ఉన్న ఈ కార్టూన్ ను కవితక్క పోస్ట్ చేశారు. ఈ కార్టూన్ ఇప్పుడు భారీగా వైరల్ అయ్యింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/