Begin typing your search above and press return to search.
సోనియా సభకు టీఆర్ ఎస్ కౌంటర్ ఇదే
By: Tupaki Desk | 24 Nov 2018 4:31 PM GMTతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ కు ఓ వైపు గడువు సమీపిస్తుండగా మరోవైపు ఈ ఎన్నికల హీటును పెంచే క్రమంలో జాతీయ అగ్రనేతలు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ శుక్రవారం మేడ్చల్‌లో సభ నిర్వహించగా ఈనెల 27 తేదీ నుంచి సభలు - సమావేశాలు నిర్వహించేందుకు బీజేపీ అగ్రనేతలైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విచ్చేస్తున్నారు. ఇదిలాఉండగా, సోనియా తన సభలో టీఆర్ ఎస్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ ముఖ్యనేత విమర్శలపై టీఆర్ ఎస్ నేతలు ఘాటుగానే స్పందించారు. టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ మొదటగా తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరును మార్చాలని అన్నారు. మేడ్చల్ సభలో సోనియగాంధీ హిందీ చాలా మందికి అర్థమైందని అయితే - తెలుగు అనువాదంలో ఆమె మాట్లాడని మాటలు కూడా జొప్పించారని ఎద్దేవా చేశారు. వాళ్లు రోజు మాట్లాడేదే అనువాదంలో చెప్పారని ఆరోపించారు. తెలంగాణ నీల్లు - నిధులు - నియామకాల కోసమే అని కేసీఆర్ చెప్పారని అయితే - సోనియాను భ్రమల్లో పెట్టి కాంగ్రెస్ నేతలు అబద్దాలు చెప్పించారన్నారు. ``దేశంలో తెలంగాణ అన్ని రాష్ర్టాల కన్నా ముందుంది. తెలంగాణ అనేక అవార్డులు - రివార్డులు సాధించింది. ఇతర రాష్ర్టాల కాంగ్రెస్ మంత్రులు తెలంగాణకు వచ్చి ప్రభుత్వ తీరును కొనియాడారు. సోనియగాంధీకి ఇవన్నీ తెలియవా? కేసీఆర్ ఆమరణ దీక్ష తర్వాతే తెలంగాణ ఇస్తామన్న ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పాటు ఆలస్యం కావడం వల్లే ఆత్మహత్యలు జరిగాయి. ఆత్మహత్యలకు కాంగ్రెస్ - టీడీపీలు కారణమని కోదండరామ్ తెలియదా?`` అని వివరించారు.
డిసెంబర్ 11న సోనియాగాంధీ సహా కూటమి నేతల కళ్లు తెరిపించే ఫలితాలు వస్తాయని వినోద్ పేర్కొన్నారు. `` తెలంగాణ అంటే ఏమిటో డిసెంబర్ 11న తెలుస్తుంది. సోనియా ప్రసంగానికి సభలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలే స్పందించలేదు. సోనియా చెబుతోంది అబద్ధం కాబట్టే కార్యకర్తలు కూడా స్పందించలేదు. దేశంలో 18 పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రభాగాన ఉంది. రాహుల్ ప్రసంగం విన్న తర్వాత తలను దేంతో కొట్టుకోవాలో తెలియలేదు. అంబేడ్కర్ పేరు ప్రాణహితకు యథావిథిగా కొనసాగుతోంది. భూ సేకరణ ఉమ్మడి జాబితాలో ఉంటుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటక కూడా భూసేకరణ చట్టాన్ని సవరించింది. తెలంగాణ తనకున్న హక్కు మేరకే భూ సేకరణ చట్టాన్ని సవరించింది. ప్రత్యేక హోదా అంటే ఏమిటో కాంగ్రెస్ నిర్వచనం చెప్పాలి. ఇప్పటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదాను ఎవరూ ఇవ్వలేరు. ఏపీకి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఏపీ ప్రజలను మరోసారి మోసం చేయడానికే కాంగ్రెస్ హోదా ఇస్తానంటోంది. ఉత్తమ్ అసహనంతోనే టీఆర్ ఎస్ ను బొంద పెడతా అంటున్నాడు`` అని ఆయన పేర్కొన్నారు.