Begin typing your search above and press return to search.

గులాబీ ఎంపీల వ్యూహంపై క్వ‌శ్చ‌న్లు షురూ!

By:  Tupaki Desk   |   20 March 2018 12:54 PM GMT
గులాబీ ఎంపీల వ్యూహంపై క్వ‌శ్చ‌న్లు షురూ!
X
అన్ని వ్యూహాలు ఒకేలా వ‌ర్క్ వుట్ కావు. ఆత్మ‌విశ్వాసం అనే ద‌రిద్రం ఎప్పుడైతే మెద‌డులోకి వ‌చ్చి చేరుతుందో వాస్త‌వాన్ని అర్థం చేసుకునే గుణాన్ని మిస్ అయ్యేలా చేస్తుంది. మ‌రి.. ఇలాంటి నీతులు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు తెలీవా? అంటే.. ఇలాంటివి ఆయ‌న ట‌న్నులు.. ట‌న్నులు అల‌వోక‌గా చెప్పేయ‌గ‌ల‌రు.

శ‌కునం చెప్పే బ‌ల్లి అన్న పాత సామెత రీతిలో ఇప్పుడు కేసీఆర్ సారు వేసిన వ్యూహాం ఇప్పుడు ఎదురు దెబ్బ ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లు ఎప్ప‌టిక‌ప్పుడు ప్లాన్ ఛేంజ్ తీరు ఈ మ‌ధ్య‌న కేసీఆర్ లో త‌గ్గిందా? అన్న సందేహం క‌లుగుతోంది.

నిన్న‌టికి నిన్న ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌ధాని కోల్ క‌తాకు కూతురుతో పాటు.. మ‌రికొంద‌రు స‌న్నిహితుల్ని వెంట‌బెట్టుకెళ్లిన కేసీఆర్‌.. దీదీ మ‌మ‌త‌తో భేటీ కావ‌టం తెలిసిందే. ఓ ప‌క్క జాతీయ స్థాయిలో బీజేపీ.. కాంగ్రెస్ ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాలంటూ పెద్ద పెద్ద మాట‌లు చెబుతూ.. అందుకు భిన్నంగా లోక్ స‌భ‌లో గులాబీ ఎంపీలు చేస్తున్న తీరుపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్ర‌త్యేక హోదాపై త‌మ మ‌ద్ద‌తును టీఆర్ ఎస్ ఎంపీలు ఇప్ప‌టికే ప్రక‌టించారు.మ‌రి.. మాట ఇచ్చిన త‌ర్వాత దాన్ని నిల‌బెట్టుకోవాలి క‌దా? తెలంగాణ అయితే టీఆర్ ఎస్ అడ్డా. ఎక్కువ త‌క్కువ చేసినా.. త‌న ప్ర‌జ‌ల‌కు సర్ది చెప్పుకోవ‌టానికి కేసీఆర్ కు అవ‌కాశం ఉంటుంది. కానీ.. జాతీయ స్థాయిలో అలాంటి ప‌ప్పులు ఉడ‌క‌ని ప‌రిస్థితి. ఓప‌క్క మోడీకి వ్య‌తిరేకంగా జ‌ట్టు క‌డ‌తాన‌ని చెబుతున్న గులాబీ అధినేత‌.. మ‌రోవైపు అదే మోడీ సర్కారుకు వ్య‌తిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే.. చ‌ర్చ‌కు రానివ్వ‌కుండా చేయ‌టంపై ప‌లువురు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

కేసీఆర్ వ్యూహ ప్ర‌తివ్యూహాలు తెలుగు నేల మీద అంద‌రికి ఐడియా ఉన్న‌ప్ప‌టికీ.. జాతీయ స్థాయిలో అలాంటిది లేక‌పోవ‌టం.. రావు చెప్పే దానికి చేసే దానికి పొంత‌న లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే టాక్ ఇప్పుడు ఎక్కువ అవుతోంది. సోష‌ల్ మీడియాలో ఇదే అంశంపై కొన్ని పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. కోల్ క‌తాకు వెళ్లిన సంద‌ర్భంగా కేసీఆర్ ను ఉద్దేశించి.. ఇదే అంశంపై దీదీ సీరియ‌స్ అయిన‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది.

మొద‌టి రెండుసార్లు అనుకోకుండా జ‌రిగింద‌ని భావించినా.. మంగ‌ళ‌వారం మాత్రం అలాంటి ప‌రిస్థితి లేద‌ని చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు చేతులు జోడంచి మ‌రీ త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరినా.. నై అంటే నై అంటూ వెల్ లోకి దూసుకెళ్లి నిర‌స‌న చేయ‌టం చూస్తే.. మోడీతో ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ కు కేసీఆర్ పాల్ప‌డుతున్నార‌న్న‌ది ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాలు పేర్కొన‌టం గ‌మ‌నార్హం.

టీఆర్ ఎస్ తీరు బీజేపీకి స‌హ‌క‌రించేదిలా ఉంద‌న్న మాట‌పై ఆ పార్టీకి చెందిన జితేంద‌ర్ రెడ్డి స‌మాధాన‌మిస్తూ.. "వాళ్ల‌కు వాళ్లు మా మీద ఆరోప‌ణ‌లు చేయ‌టం కాదు. ఈ రోజు వాళ్ల‌కు అవిశ్వాస తీర్మానం పెట్టాల‌ని మ‌న‌సొచ్చింది. మా ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు ముఖ్యం. మా డిమాండ్ల‌పై వాగ్దానం చేసిన మమ్మ‌ల్ని కూర్చోబెడితే కూర్చోవ‌టానికి సిద్ధం" అంటూ చెబుతున్న మాట‌లు చూస్తే.. అవిశ్వాసం బిల్లును చ‌ర్చ‌కు రానివ్వ‌కుండా చేయాల‌న్న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న విష‌యం అర్థ‌మైపోవ‌టం లేదు?