Begin typing your search above and press return to search.

పార్లమెంట్ ముందు ధర్నాకి దిగిన టిఆర్ఎస్ ఎంపీలు ..ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   11 Dec 2019 8:22 AM GMT
పార్లమెంట్ ముందు ధర్నాకి దిగిన టిఆర్ఎస్ ఎంపీలు ..ఎందుకంటే ?
X
బుధవారం పార్లమెంట్ ఆవరణలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన చేపట్టారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఎంపీలు ధర్నాకి దిగారు అని సమాచారం. అలాగే ఇదే ఉభయసభల్లో వాయిదా తీర్మానాలను కూడా సమర్పించారు.

వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, ఆర్థిక సంఘం బకాయిలు, గ్రామీణాభివృద్ధి నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణాభివృద్ద్ధి నిధులను తక్షణమే విడుదల చేయాలనీ, దేశంలో ఆర్థిక మాంద్యం లేదని చెబుతున్న కేంద్రం రాష్ట్రానికి అవసరమైన నిధులను ఎందుకు మంజూరు చేయడంలేదంటూ ఎంపీలు ఆరోపించారు. ఈ ఆర్ధిక సంవత్సరం పన్నుల్లో రాష్ట్ర వాటా గత ఏడాదికన్నా 2. 13 శాతం తక్కువ వచ్చిందని కూడా ఎంపీలు చెప్పారు.

కాగా.. ఈ విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇటీవలే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం నుంచి పన్నుల వాటా రూ.19,719 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఇది కేంద్ర బడ్జెట్‌లోనే స్పష్టం చేశారు. కానీ, ఈ ఎనిమిది నెలల్లో రాష్ట్రానికి రూ.10.5 వేల కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఈ నిధులు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.224 కోట్లు తక్కువ.’’ అని లేఖలో వివరించారు. నిధులను విడుదల విషయంలో జాప్యం జరిగితే సంక్షేమ పథకాలకు కోత పెట్టాల్సి వస్తుందని వివరించారు.