Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ టు బీఆర్ఎస్.. ఈసీ ఆమోదం..

By:  Tupaki Desk   |   8 Dec 2022 4:24 PM GMT
టీఆర్ఎస్ టు బీఆర్ఎస్.. ఈసీ ఆమోదం..
X
తెలంగాణ రాష్ట్ర సమితి ఇక ఉద్యమ పార్టీగా చరిత్ర పుటల్లోకి ఎక్కి కనుమరుగు కానుంది. ఇక బీఆర్ఎస్ తెరపైకి రానుంది. ఈరోజు నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి కనుమరుగై భారత రాష్ట్ర సమితిగా మారింది. తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి పార్టీ రూపాంతరం చెందింది. కేసీఆర్ ఇక జాతీయ నేత కానున్నారు.

టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ గా మార్పును ఆమోదిస్తూ ఈసీ తాజాగా కేసీఆర్ కు లేఖ పంపింది. సీఈసీ నుంచి కేసీఆర్ కు అధికారికంగా లేఖ వచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9న మధ్యాహ్నం 1.20 గంటలకు 'భారత్ రాష్ట్ర సమితి' ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని.. అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.

రేపు తెలంగాణ భవన్ లో తనకు అందిన అధికారిక లేఖకు రిప్లైగా సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపుతారు. అనంతరం కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. శుక్రవారం పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు హాజరుకావాలని కోరారు.

అక్టోబర్ 5న దసరా రోజు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితి(‘బీఆర్ఎస్)గా మారుస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో పేరు మార్పుపై ప్రవేశపెట్టిన తీర్మానానికి 283 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.తెలుగువారితోపాటు హిందీలోనూ సులభంగా అర్థమవుతుందనే ఉద్దేశంతో భారత్ రాష్ట్ర సమితి పేరు ఎంపిక చేశారు.
టీఆర్ఎస్ లో తెలంగాణ బొమ్మ అందులోని 33 జిల్లాలు పార్టీ జెండాలో కనిపిస్తే.. బీఆర్ఎస్ లో భారతదేశ పటంను ముద్రించారు. కేవలం తెలంగాణ ప్లేసులో భారత్ వచ్చి చేరింది.

ఇక టీఆర్ఎస్ పేరు మార్చుతూ భారత రాష్ట్ర సమితిగా ఎన్నికల కమిషన్ కు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కేకే పంపారు. మాజీ ఎంపీ వినోద్, లీగల్ టీంలు ఎన్నికల కమిషన్ కు అందజేశారు. ఇన్నిరోజులకు అభ్యంతరాలు.. వివిధ విచారణల తర్వాత టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.