Begin typing your search above and press return to search.

మునుగోడు రేసు: టీఆర్ఎస్ అభ్యర్థి ఆయనే?

By:  Tupaki Desk   |   19 Aug 2022 1:30 PM GMT
మునుగోడు రేసు: టీఆర్ఎస్ అభ్యర్థి ఆయనే?
X
తెలంగాణలో ఉప ఎన్నికల వేడి రాజుకుంటోంది. మునుగోడు ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ దూకుడు పెంచింది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించడానికి రెడీ అయ్యింది. అందరి అంచనాలు తలకిందులుచేస్తూ మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉంటారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

శనివారం మునుగోడులో సీఎం కేసీఆర్ సభను ఏర్పాటు చేశాడు. ఈ సభలోనే అభ్యర్థిని ప్రకటిస్తారని అంటున్నారు. ప్రభాకర్ రెడ్డికే టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. తాజాగా చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీ, సర్సంచ్ లు , సింగిల్ విండో చైర్మన్లు 200 మందికిపైగా సమావేశమై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్ది తీరుపై ధ్వజమెత్తారు. ఆర్తికంగా ఆయన ఇబ్బంది పెట్టారని.. మంచి బట్టలు తొడిగినా ఓర్వలేదని.. గ్రామాల్లో గ్రూపులు కట్టి విభజించారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేతలంతా కూడా ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని.. ఇస్తే పనిచేయొద్దని.. ఆయనకు తప్ప ఎవరికిచ్చినా సరే అని తీర్మానం చేసి పంపారు. ఈ తీర్మాన పత్రాన్ని పార్టీ అధిష్టానానికి అందజేయనున్నట్టు చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి తెలిపారు.

కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదని.. టీఆర్ఎస్ పెద్దలు అసమ్మతి నాయకులను పిలిపించుకొని మాట్లాడి వారిని శాంతింప చేసినట్లు తెలిసింది. అందరినీ ఏకతాటిపైకి వచ్చేలా చేసిన తర్వాతే ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ఫైనల్ చేయాలని కోరినట్లు సమాచారం.

అయితే ప్రభాకర్ రెడ్డి మాత్రం కేసీఆర్, కేటీఆర్ తో లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది. తనకే టికెట్ కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ కూడా ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ప్రభాకర్ రెడ్డి ఉన్న అసమ్మతితో నియోజకవర్గంలో గెలవడం కష్టమని.. మరి కేసీఆర్ టికెట్ ప్రకటిస్తే టీఆర్ఎస్ కు నియోజకవర్గంలో ఎదురుదెబ్బలు తప్పవన్న చర్చ సాగుతోంది.