Begin typing your search above and press return to search.

స‌భ‌లో కేసీఆర్ బ్యాచ్ ఏం చేయ‌నుంది?

By:  Tupaki Desk   |   20 July 2018 5:43 AM GMT
స‌భ‌లో కేసీఆర్ బ్యాచ్ ఏం చేయ‌నుంది?
X
మరికాసేప‌ట్లో మోడీ స‌ర్కారుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రానున్న సంగ‌తి తెలిసిందే. త‌మ దాయాది ఏపీ ప్ర‌వేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప‌క్క‌నున్న తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు ఎలాంటి వ్యూహాన్ని అనుస‌రించ‌నుంది. విభ‌జ‌న హామీల‌తో పాటు.. ఏపీకి ఇస్తామ‌న్న ప్ర‌త్యేక‌హోదా హామీని నెర‌వేర్చాలంటూ ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో టీఆర్ఎస్ పాత్రపై ప్ర‌త్యేక ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతోంది. అవిశ్వాస తీర్మానంపై సాగు చ‌ర్చ‌లో టీఆర్ఎస్ స‌భ్యులు పాల్గొంటారా? లేదా? అన్న దానిపై క్లారిటీ ఇస్తూ.. వారు పాల్గొంటార‌ని తెలుస్తోంది.

త‌మ‌కు మాట్లాడే అవ‌కాశం త‌క్కువ‌గా ఉన్నా.. ఆ స‌మ‌యంలోనే విభ‌జ‌న సంద‌ర్భంగా త‌మ‌కిచ్చిన హామీలు అమ‌లు విష‌యంపై ప్ర‌శ్నించ‌టంతో పాటు.. ఏపీకి సాయం చేస్తే.. త‌మ సంగ‌తేమిట‌న్న విష‌యాన్ని ప్ర‌శ్నించే వీలుంద‌ని చెబుతున్నారు. ఏపీకి సాయం చేసే ఆలోచ‌న ఉన్న‌ప్పుడు త‌మ‌ను మ‌ర్చిపోవ‌ద్ద‌న్న వైనాన్ని చెప్పాల‌ని భావిస్తున్న‌ట్లుగా స‌మాచారం.

అవిశ్వాసంపై జ‌రిగే చ‌ర్చ‌లో టీఆర్ ఎస్ త‌ర‌ఫున జితేంద‌ర్ రెడ్డి.. వినోద్ కుమార్ లు మాట్లాడాల‌ని డిసైడ్ చేశారు. తెలంగాణ‌కు జ‌రిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామ‌న్నారు. స‌భ‌లో అవిశ్వాసంపై చ‌ర్చ జ‌రుగుతుందే త‌ప్పించి ఓటింగ్ జ‌రిగే అవ‌కాశం లేద‌న్నారు. ప్ర‌తిప‌క్షాల‌కు త‌గినంత సంఖ్యా బ‌లం లేని నేప‌థ్యంలో చ‌ర్చ‌తోనే ముగిస్తారే త‌ప్పించి.. ఓటింగ్ వ‌ర‌కూ వెళ్లే వీలుండ‌ద‌ని చెప్పారు.

ఒక‌వేళ ఓటింగ్ జ‌రిగితే పార్టీ స్టాండ్ ఏమిట‌న్న అంశంపై టీఆర్ ఎస్ ఎంపీలు పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. ఏం జ‌రిగినా అప్ప‌టి ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించాల్సిందిగా కేసీఆర్ వారికి చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. అస‌లేం చేయాల‌న్న విష‌యాన్ని త‌న‌కు మొద‌ట్నించి న‌మ్మ‌క‌స్తుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న వినోద్ కుమార్ కు చెప్పాల్సింది చెప్పేసి ఉంటార‌ని తెలుస్తోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఓటింగ్ జ‌రిగితే త‌ట‌స్థంగా ఉండేందుకే ఎక్కువ మ‌క్కువ ప్ర‌ద‌ర్శిస్తార‌నిచెబుతున్నారు.