Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ ఆకర్ష్ వలలో లేడీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 3 Dec 2015 5:47 AM GMTతెలంగాణలో టీఆర్ ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ వలలో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిక్కుకున్నారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. తాను టీఆర్ ఎస్ లో చేరుతున్న వార్తలను సదరు ఎమ్మెల్యే ఖండిస్తున్నా ఆమెపై అధికార పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. మాజీ మంత్రి ,మెదక్ జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గీతారెడ్డి టీఆర్ ఎస్ లో చేరే విషయంలో తీవ్ర తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది.
టీఆర్ ఎస్ కు మెదక్ జిల్లా కంచుకోట. ఈ జిల్లాలో గీతారెడ్డి లాంటి సీనియర్ ను తమ పార్టీలో చేర్చుకుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ ను కూకటివేళ్లతో సహా పెకిలించినట్లవుతుందని టీఆర్ ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. గీతారెడ్డి పార్టీ మారుతున్నారంటూ ఇప్పటికే మీడియాలో పలు కథనాలు వచ్చాయి.ఈ వార్తలను గీతారెడ్డి ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె చెప్పినా ఆమెపై అధికార పార్టీ నేతల ఒత్తిడి గట్టిగానే ఉందని తెలుస్తోంది.
మెదక్ జిల్లాకు చెందిన మంత్రి హరీష్ రావుతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి గీతారెడ్డిని టీఆర్ ఎస్ లోకి తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. గీతారెడ్డి మాత్రం తాను ఎమ్మెల్యేనని... తన తల్లి ఈశ్వరీ బాయి జన్మదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తారని, ఆ కార్యక్రమంలో తాను టీఆర్ ఎస్ నేతలతో కలిసి పాల్గొంటే పార్టీ మారినట్టు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నిస్తున్నారు. మెదక్ జిల్లాలో త్వరలోనే నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికలోగానే గీతారెడ్డిని టీఆర్ ఎస్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక గీతారెడ్డితో పాటు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మాజీ మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ కూడా టీఆర్ ఎస్ లో చేరతారనే వదంతులు జోరందుకున్నాయి.