Begin typing your search above and press return to search.
న్యూఇయర్ లో కమలంతో కారు చెట్టాపట్టాల్
By: Tupaki Desk | 25 Dec 2016 10:12 AM GMTపవర్ రాజకీయాల్లో బలమే కీలకం. దాని చుట్టూనే విషయం అంతా తిరుగుతుంటుంది. పవర్ కోసం చేసే ప్రయత్నాలు.. పరిస్థితులకు తగ్గట్లుగా మారిపోతుంటాయి. ప్రయాస పడి బలాన్ని పెంచుకునే కన్నా.. సంబంధాన్ని కలుపుకోవటం ద్వారా తిరుగులేని అధిక్యతను సంపాదించటం సులువు అయినప్పుడు మొదటి మార్గం కంటే రెండో మార్గాన్నే ఎంచుకుంటారు తెలివైనోళ్లంతా. అందుకేనేమో.. ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రం విషయంలో తెలివిగా ఆలోచించినట్లుగా కనిపిస్తోంది.
టీఆర్ ఎస్ ప్రభుత్వానికి తామే ప్రత్యామ్నాయం అన్న మాటను చెప్పిన నోటితోనే.. వాస్తవాన్ని గుర్తించి.. తన ప్లాన్ మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కేసీఆర్ ను కాదని మరో పార్టీ మనగలే పరిస్థితి లేదన్న విషయంపై మోడీ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం.. మోడీతో సంబంధం కలుపుకోవటానికి తహతహలాడుతున్న వేళ.. తన గేమ్ ప్లాన్ ను మోడీ అండ్ టీం మార్చుకున్నట్లు కనిపిస్తోంది.
ఆ మధ్యన తెలంగాణ అధికారపక్షంపై అదే పనిగా విమర్శలు చేసే కమలనాథులు.. ఈ మధ్యన కామ్ గా ఉండటం మర్చిపోకూడదు. అదే సమయంలో గులాబీ నేతలు సైతం కమలనాథులపై కస్సుమనకుండా గమ్మున ఉండటాన్ని గమనించకుండా ఉండలేం. ఎందుకిలా జరుగుతోంది? ఏదీ కూడా కారణం లేకుండా జరగదు? అలాంటిది రెండు రాజకీయ పక్షాలకు చెందిన నేతలు కామ్ గా ఉన్నారంటే.. ఎవరి పరిధులు వారు దాటటం లేదంటే కొత్త లెక్క ఏదో వర్క్ వుట్ అవుతున్నట్లే.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణ అధికారపక్షం.. కేంద్రంలోని మోడీ సర్కారు చెట్టాపట్టాలు వేసుకోవటానికి రంగం సిద్ధమైందని చెబుతున్నారు. ఇందుకు నోట్ల రద్దు ఇష్యూ వారిమధ్య బంధాన్ని మరింత బలపరిచేలా చేసిందన్న మాట వినిపిస్తోంది. తమ పార్టీలు అధికారంలో ఉన్న చోట కూడా లేనంత సానుకూలత.. తమకేమాత్రం మిత్రపక్షం కాని తెలంగాణ రాష్ట్రంలో నోట్లరద్దుపై సానుకూల వైఖరిని కనిపించటమే కాదు.. ఒకరోజు నోట్ల రద్దుపై పాజిటివ్ చర్చను తెలంగాణ అసెంబ్లీలో జరపటం మర్చిపోకూడదు. ఈ సందర్భంగా విపక్షాలు విమర్శించినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం సానుకూలంగా వ్యవహరించటమే కాదు.. మోడీ సర్కారు నిర్ణయాన్ని సమర్థించటాన్ని మర్చిపోకూడదు.
రానున్న రోజుల్లో కలిసి ప్రయాణిస్తే.. ఉభయ తారకం అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్న వేళ.. గులాబీ కారుకు.. కాషాయం కమలానికి మధ్య పెళ్లి సంబంధం ఖాయమనే మాట వినిపిస్తోంది. అది కొత్త సంవత్సరం తొలినాళ్లలోనే జరిగే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. బడ్జెట్ సమావేశాల నాటికి కొత్త బంధం అధికారికంగా మారుతుందని చెబుతున్నారు. తాజాగా వినిపిస్తున్న అంచనాల ప్రకారం.. కేంద్ర క్యాబినెట్ లో టీఆర్ ఎస్ సీనియర్ నేత కేకే.. లోక్ సభలో టీఆర్ ఎస్ సభాపక్ష నేతగా ఉన్న జితేందర్ రెడ్డికి మోడీ క్యాబినెట్ లో స్థానం లభించొచ్చని చెబుతున్నారు. సో.. మరికొద్ది రోజుల్లో కమలంతో కారు సయ్యాట చూసే రోజు వచ్చేస్తుందన్న మాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/