Begin typing your search above and press return to search.
కేసీఆర్ 'మంత్రి' ఫార్ములా.? ఫలించేనా.?
By: Tupaki Desk | 24 Oct 2018 8:10 AM GMTముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ అంతే వేగంగా కదులుతున్నారు. గెలుపుకు అవకాశమున్న అన్ని దారులను వెతుకుతున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై రిపోర్ట్ తెప్పించుకుంటూ. చురుకుగా లేని మంత్రులకు చురకలు పెడుతున్నారు.
ఎన్నికలకు వెళ్తున్నామన్న కేసీఆర్.. అసెంబ్లీ రద్దు చేసిన రొజే 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇంకా 12 మందిని మాత్రమే ప్రకటించాల్సి ఉంది. మహా కూటమిలో సీట్ల సర్దుబాటు కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. ఇటీవల బీజేపీ ఒక లిస్టు విడుదల చేసింది. ఈ క్రమంలో తెరాస అభ్యర్ధులు ప్రచారంలో మరింత దూకుడు పెంచాలని సూచనలు చేస్తున్నారట కేసీఆర్.
ఎప్పటికప్పుడు రిపోర్టులను తెప్పించుకుంటున్న ఆయన.. మంత్రులు కేవలం వారి నియోజకవర్గాలకు పరిమితమవ్వడం గమనించి హితోపదేశం చేశారట. ఎట్టి పరిస్థితుల్లోనూ నియోజకవర్గాలకు పరిమితం కాకూడదని జిల్లాలో ని మిగతా అసెంబ్లీ సీట్లపై కూడా దృష్టి పెట్టాలని ఆదేశించారట. తెలంగాణ మంత్రుల్లో ఇద్దరు మాత్రమే అన్ని నియోజకవర్గాలను లీడ్ చేస్తూ అలరిస్తున్నారని.. మిగతా వారంతా స్తబ్దుగా ఉంటున్నారని కేసీఆర్ ఫైర్ అయినట్టు తెలిసింది.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు కేటీఆర్ - ఈటెల రాజేందర్ లు మిగతా అభ్యర్థుల నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇక నిజామాబాద్ ఎంపీ కవిత సైతం తన పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటిస్తూ అభ్యర్థుల గెలుపును భుజానావేసుకున్నారు. ఇక ఖమ్మంలో మంత్రి తుమ్మల సైతం కొన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక హరీష్ రావు అయితే మొత్తం తెలంగాణ కవర్ చేస్తున్నారు. మిగతా మంత్రులు మాత్రం తాము పోటీచేస్తున్న స్థానాన్ని మాత్రమే చూసుకుంటూ విస్మరిస్తున్నారు. దీనిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మంత్రులంతా పాత జిల్లాల పరిధిలో పర్యటించి అందరి గెలుపు కు కృషి చేయాలని కోరినట్టు సమాచారం.
మొత్తమ్మీద ఎప్పటికప్పుడు ఎన్నికల వ్యూహాలను మారుస్తూ కేసీఆర్ ప్రత్యర్థి పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ప్రతి అంశాన్ని అనులూలంగా మలుచుకుంటున్నారు. కూటమి నేతలు సీట్ల సర్దుబాటు దగ్గరే చతికిల పడి పోవడం కూడా ప్లస్ అయ్యేలా ఉంది. ముందస్తు ఎన్నికలు వెళ్లడం.. సిట్టింగ్ అభ్యర్థులు ప్రచారంలో కూడా ముందుండేలా చూస్తే గెలిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు కేసీఆర్. మరి ఆ వ్యూహాలు ఎంత వరకు పనిచేస్తాయో ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే.